నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రాస్తున్న లేఖలకు సమాధానం ఇచ్చే దమ్ము, ధైర్యం ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఉందేమో మంత్రి కొడాలి నాని సమాధానం చెప్పాలని తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి(Divyavani) నిలదీశారు. చంద్రబాబు పేరెత్తే అర్హత కూడా కొడాలి నానికి లేదన్నారు. మంత్రి ప్రవర్తన, మాటతీరు చూసినవారంతా ఆయనకు పిచ్చిపట్టిందని భావిస్తున్నారని.. రౌడీ పాలన, కేసులకు భయపడి ప్రజలెవ్వరూ బయటకురావట్లేదని మండిపడ్డారు.
వివేకానందరెడ్డి కుమార్తె సునీత వ్యాఖ్యలపై కొడాలి నాని ఏం సమాధానం చెప్తారని ధ్వజమెత్తారు. వివేకా హత్యకేసు విచారణను సీబీఐ వేగవంతం చేశాక ..కేసుతో సంబంధమున్న వాళ్లు ఆసుపత్రుల్లో ఎందుకు చేరుతున్నారని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: