ETV Bharat / city

Dhulipalla on Kodali Nani: సవాల్​కు సమయం, సందర్భం ఎప్పుడో కొడాలి తేల్చుకోవాలి: ధూళిపాళ్ల

ధూళిపాళ్ల నరేంద్ర
ధూళిపాళ్ల నరేంద్ర
author img

By

Published : Jan 22, 2022, 1:35 PM IST

Updated : Jan 22, 2022, 4:46 PM IST

13:30 January 22

మంత్రిని ఎందుకు బర్తరఫ్ చేయలేదు

మాట్లాడుతున్న ధూళిపాళ్ల నరేంద్ర

TDP Dhulipalla on Kodali Nani: బహిరంగంగా క్యాసినోలు నిర్వహిస్తే సీఎం జగన్‌ మౌనం వహించడం దేనికి సంకేతమని తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. సీఎం, డీజీపీ మౌనం చూస్తుంటే అనుమానం కలుగుతోందన్నారు. ఇంత వరకు మంత్రిని ఎందుకు బర్తరఫ్‌ చేయలేదని నిలదీశారు. గుడివాడలో మంత్రి కొడాలి నాని కన్వెన్షన్‌ సెంటర్లో క్యాసినో నిర్వహించారనే ఆరోపణల నేపథ్యంలో ధూళిపాళ్ల మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. క్యాసినో నిర్వహించారని వీడియో బయట పెట్టారు. సీఎం స్పందననూ మీడియా సమావేశంలో ప్రదర్శించారు.

‘‘ముఖ్యమంత్రి సహకారంతోనే ఈ క్యాసినో జరిగిందా?జూద రాజధానిగా గుడివాడను అభివృద్ధి చేస్తున్నారా?అలా మారుస్తుంటే ప్రతిపక్షం మౌనంగా ఉండాలా? క్యాసినో జరగలేదని మంత్రి కొడాలి నాని బుకాయించారు. నేను బయటపెట్టిన ఆధారాలపై మంత్రి సమాధానం చెప్పాలి. సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి వీడియోలు కోకొల్లలు. క్యాసినో నిర్వహణపై సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. మూడు రోజులు పోలీసులు ఆ వైపు చూడలేదు. దీనికి సీఎం సహకారం ఉందన్నది బహిరంగ సత్యం’’ అని ధూళిపాళ్ల ఆరోపించారు.

ఇదీ చదవండి:

భాజపాకు మరో షాక్.. పార్టీని వీడనున్న మాజీ సీఎం

Last Updated : Jan 22, 2022, 4:46 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.