ETV Bharat / city

Devineni: 'దళారులు, వ్యాపారులు కుమ్మక్కై రైతులను దోచేస్తున్నారు'

author img

By

Published : Jun 19, 2021, 3:57 PM IST

Updated : Jun 19, 2021, 5:53 PM IST

రైతులకు రూ.1637 కోట్లు చెల్లించామన్నలెక్కలపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళారులు, వ్యాపారులు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి తప్పుడు లెక్కలు చెబుతున్నారని ధ్వజమెత్తారు.

devi
devi

'దళారులు, వ్యాపారులు కుమ్మక్కై రైతులను దోచేస్తున్నారు'

ధాన్యం కొనుగోళ్లపై..మంత్రి కొడాలి నాని తప్పుడు లెక్కలు చెబుతున్నారని..మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. రబీ సీజనులో రైతులకు 16 వందల 37 కోట్లు చెల్లించామన్న లెక్కలపై..శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దళారులు, వ్యాపారులు కుమ్మక్కై రైతులను దోచేసుకుంటున్నారని మండిపడ్డారు. ధాన్యం రైతులకు ప్రభుత్వం రూ.3670కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు.

"రాష్ట్ర వ్యాప్తంగా 1,777 పీపీసీ కేంద్రాల్లో 2,44,898 మంది రైతుల నుంచి దాదాపు 28.38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటికి సంబంధించి ప్రభుత్వం రూ. 5308 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉండగా..కేవలం రూ.1637మాత్రమే చెల్లించారు. రైతుల నుంచి ఇంకా 6.48లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. రైతుల పక్షాన ప్రశ్నిస్తూ..వారి సమస్యలపై చంద్రబాబు ముఖ్యమంత్రికి లేఖ రాస్తే అపహాస్యం చేశారు. జగన్ కళ్లల్లో ఆనందం చూసేందుకు కొడాలి నాని దిగజారి మాట్లాడుతున్న తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారు. 75 కేజీల ధాన్యం బస్తాని రూ.1410 కి కొనాల్సి ఉండగా..దళారులు, మిల్లర్లు రైతుల్ని దోచుకుంటూ రూ. 800, 1000 కి కొనుగోళ్లు చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలన్నీ బోగస్ కేంద్రాలుగా మారటంతో పాటు ఆన్​లైన్, ఈ-క్రాప్ బుకింగ్​లో​ అన్నీ అవకతవకలే జరుగుతున్నాయి." -దేవినేని ఉమ

పుస్తకాల్లోనే పోలవరం నిర్వాసితుల పునరావాసం

పోలవరం నిర్వాసితుల పునరావాసం పుస్తకాలకే పరిమితమైందని దేవినేని దుయ్యబట్టారు. 18,622కు పైగా నిర్వాసిత కుటుంబాలను మంత్రి అనిల్ మోసం చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిర్వాసితులకు ఎన్ని ఇళ్లు నిర్మించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిర్వాసితుల ముసుగులో వైకాపా ఎమ్మెల్యేలే కోట్లాది రూపాయల పరిహారం దోచుకుంటున్నారని విమర్శించారు. ఉద్యోగాల క్యాలెండర్ అంటూ నిరుద్యోగుల చెవిలో సీఎం జగన్ పూలు పెట్టారని ఆక్షేపించారు. అశోక్ గజపతిరాజు కాలి గోటికి కూడా సరిపోని విజయసాయి ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు.

ఇదీ చదవండి: EAMCET: ఎంసెట్‌కు బదులుగా.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!

Last Updated : Jun 19, 2021, 5:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.