DEVINENI UMA: గోదావరి వరద అంచనాలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. పోలవరం నిర్వాసితులను ప్రభుత్వం గాలికొదిలేసిందని తెదేపా నేత దేవినేని ఉమ ధ్వజమెత్తారు. జూన్, జులైలో వరదలొస్తాయనే కనీస స్పృహ కూడా లేదని విమర్శించారు. అసమర్థుడి చేతిలో పాలన ఉంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద పరిస్థితిని కూడా అంచనా వేయలేని స్థితిలో ఉన్నారని మండిపడ్డారు.
పోలవరం నిర్వాసితులకు ఆమడ దూరంలో అధికారులు ఉన్నారని.. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా.. యంత్రాంగం పని చేస్తుందా అని ప్రశ్నించారు. వరదల వల్ల గ్రామాలు మునిగిపోతుంటే అధికారులు పట్టించుకోరా అని ధ్వజమెత్తారు. వరద బాధితులకు సాయం చేసే పరిస్థితి కూడా కరవైందని..గ్రామాలకు గ్రామాలు మునిగిపోతున్నా చీమ కుట్టినట్లు లేదని మండిపడ్డారు.
ఇవీ చదవండి: