ETV Bharat / city

వైకాపా ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేస్తోంది: దేవినేని ఉమ - దేవినేని ఉమ తాజా వార్తలు

ఉద్యోగులను, ఎస్​ఈసీని బెదిరించేలా వ్యాఖ్యలు చేసిన మంత్రులపై చర్యలు తీసుకోవాలని.. తెదేపా నేత దేవినేని ఉమ డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో బలవంతపు ఏకగ్రీవాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

tdp leader devineni uma fires on ycp over constitutional systemsc
వైకాపా ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేస్తోంది: దేవినేని ఉమ
author img

By

Published : Feb 7, 2021, 2:02 PM IST

వైకాపా ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేస్తోందని తెదేపా నేత దేవినేని ఉమ ధ్వజమెత్తారు. దిల్లీలో మోదీ, అమిత్‌షాలతో జరిగిన భేటీల్లో.. విశాఖ ఉక్కు పరిశ్రమను తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఆ భేటీల వివరాలు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు.

90 శాతం పంచాయతీలు గెలిస్తేనే మంత్రులకు పదవులుంటాయని, ఎమ్మెల్యేలకు.. వచ్చే ఎన్నికల్లో సీట్లు లభిస్తాయని.. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వచ్చాయని దేవినేని ఉమా ధ్వజమెత్తారు.

వైకాపా ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేస్తోంది: దేవినేని ఉమ

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా.. చాలా చోట్ల బలవంతపు ఏకగ్రీవాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఎన్నికల కమిషనర్​పై మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలన్నీ.. ముఖ్యమంత్రి అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్నాయని ఆక్షేపించారు. ఎస్ఈసీకి సహకరించిన అధికారులను బ్లాక్ లిస్ట్​లో పెడతానన్న మంత్రిపై.. గవర్నర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని దేవినేని ప్రశ్నించారు. ప్రజలు ఓటు వేస్తేనే.. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలును, రాక్షసపాలనను అడ్డుకోగలరని సూచించారు. ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టిన ముఖ్యమంత్రి జగన్.. తనపై ఉన్న కేసులకు భయపడే ఇప్పడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో నోరెత్తడం లేదని ఆయన మండిపడ్డారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఏఏ కంపెనీలు, ఎవరెవరితో చర్చలు జరిపాయో ముఖ్యమంత్రికి తెలియదా అని నిలదీశారు.

ఇదీ చదవండి: మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు తప్పిన ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.