సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలకు అధికారులు బలవుతున్నారని.. తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పోలవరం సహాయ, పునరావాస కార్యక్రమాలను పూర్తి చేయకుండానే గిరిజనుల తరలింపుపై.. జాతీయ ఎస్టీ కమిషన్ నిలదీసిందని గుర్తుచేశారు. వీఆర్.పురం, కూనవరం పరిధిలో.. 18 గ్రామాలకు చెందిన 17 వందల 24 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించకుండా...రాజకీయ ఒత్తిళ్లతో వారిని తరలించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం.. అందరికీ సహాయ, పునరావాసం చేపట్టాల్సి ఉండగా.. ఆ వివరాలేవీ పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్రానికి తెలియనివ్వట్లేదని మండిపడ్డారు. ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణంతో.. జూన్ నుంచే ముంపు ఎక్కువగా ఉన్నా.. ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: vijayasai letter to pm: నక్సల్స్‌కి సంబంధం లేదు.. వారు వచ్చి ట్రాక్‌ను దెబ్బతీయటం సాధ్యం కాదు!