ETV Bharat / city

'మీ ఇళ్లకు వేసుకోండి వైకాపా రంగులు' - Ap taza news

లక్షల టన్నుల ఇసుక మార్గమధ్యలో మాయమైపోతుందని వైకాపా నేతలే చెబుతుంటే... రాష్ట్రంలో ఇసుక దందా ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందన్నారు తెదేపా నేత బొండా ఉమా. వైకాపా ఏడాది పాలన పంచభూతాల దోపిడీయే లక్ష్యంగా జరిగిందని ఆరోపించారు. రాజ్యాంగ విలువలు పాటించడంలేదని కోర్టులు పదేపదే చెబుతున్నా... వైకాపా తీరులో మార్పులేదని విమర్శించారు. వైకాపా రంగులు ప్రభుత్వ భవనాలకు కాదు... వైకాపా నేతల ఇళ్లకు, ముఖాలకు వేసుకోవాలని ఎద్దేవా చేశారు.

తెదేపా నేత బోండా ఉమా
తెదేపా నేత బోండా ఉమా
author img

By

Published : Jun 3, 2020, 4:51 PM IST

పంచభూతాల దోపిడీయే లక్ష్యంగా జగన్ పాలన సాగుతోందని తెదేపా అధికార ప్రతినిధి బొండా ఉమా ధ్వజమెత్తారు. ఉచిత ఇసుక పాలసీ రద్దు చేసి.. అక్రమ మార్గాల్లో ఇసుక అమ్ముకుంటూ రూ.వేల కోట్లు వెనకేసుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వైఎస్సార్ ఇసుక మాఫియా దందా నడుస్తుందని ఆరోపించారు.

రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని వైకాపా తుంగలో తొక్కుతోందని ఆక్షేపించారు. ప్రభుత్వం రాజ్యాంగానికి అతీతంగా పనిచేస్తోందని హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులిస్తున్నా వైకాపా తీరు మారడంలేదన్నారు. పంచాయతీ కార్యాలయాలకు వైకాపా రంగులు వేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రంగులపై అంత ప్రేమ ఉంటే వైకాపా నేతల ఇళ్లకు, నేతల ముఖాలకు వేసుకోవాలని ఘాటు విమర్శలు చేశారు.

ప్రజల సొమ్ముతో నిర్మించిన భవనాలకు పార్టీ రంగులు వేయడాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టిందన్నారు. ఏడాది కాలంలో సుమారు 65 సార్లు న్యాయస్థానాలు ప్రభుత్వ తీరు తప్పుబట్టినా వైకాపా వ్యవహారశైలి మారలేదని విమర్శించారు.

ఇదీ చదవండి : 'రీచ్​లో ఎత్తిన ఇసుక ఇంటికి చేరడం లేదు..'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.