రాష్ట్రంలో అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా ఆరోపించారు. వైకాపా ప్రభుత్వమే వివిధ నాయకుల విగ్రహాలు ధ్వంసం చేస్తూ తెదేపాకు ఆపాదించాలని చూస్తోందని మండిపడ్డారు. ఈ విగ్రహాల కుట్ర రహస్య అజెండాను సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా బయట పెట్టారన్నారు. ఎస్సీలు, కాపులు, బీసీలకు ద్రోహం చేసేలా రంగా, అంబేడ్కర్ విగ్రహాల ధ్వంసానికి ప్రభుత్వం సిద్ధమవుతోందన్న ఆయన... ఆయా నాయకుల అభిమానులే విగ్రహాలను రక్షించుకోవాలని కోరారు. విగ్రహాల జోలికి వస్తే అంతు చూస్తామని బోండా ఉమా హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'శాంతి భద్రతలు క్షీణించాయి.. సీఎం గారూ స్పందించండి'