రాష్ట్రంలో మద్యపాన నిషేధం సూపర్ హిట్ అయ్యిందని మహిళల వద్ద చెప్పే ధైర్యం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, విజయసాయి రెడ్డిలకు ఉందా అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు సవాల్ చేశారు. విజయసాయి రెడ్డి పెట్టిన ట్వీట్‌పై అయ్యన్న స్పందించారు. జగన్ చెత్త పాలన దెబ్బకి విజయసాయిరెడ్డికి చిన్న మెదడు చితికినట్లుందని ఎద్దేవా చేశారు.
సంక్రాంతిలో మద్యం అమ్మకాలు తగ్గి....మద్యపాన నిషేధం సూపర్ హిట్ అయ్యిందా అని ప్రశ్నించారు. గత ఐదు నెలల్లో అత్యధికంగా 79 శాతం మద్యం అమ్మకాలు పెరిగాయని పేర్కొన్నారు. జనవరి 16 వరకే 48 శాతం అమ్మకాలు పెరిగాయని తెలిపారు. విషం కంటే ప్రమాదకరమైన బ్రాండ్స్ అమ్ముతున్న బూమ్, బూమ్ జగన్ రెడ్డి మహిళల పుస్తెలు తెంపుతున్నారని ధ్వజమెత్తారు. 25 వేల కోట్లు దోపిడీ చేస్తూ మద్యపాన నిషేధం అనడానికి విజయ సాయిరెడ్డికి నోరు ఎలా వస్తుందని మండిపడ్డారు.
ఇదీ చదవండి: