రైతులేమైనా సీబీఐ నిగ్గు తేల్చిన 43వేల కోట్ల రూపాయల ప్రజాధనం దోపిడీదారులా? అని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నిలదీశారు. 3 రాజధానుల్ని ప్రజలు వ్యతిరేకిస్తుంటే... వైకాపా నేతలు పెయిడ్ ఆర్టిస్టులతో దొంగ దీక్షలు చేయిస్తున్నారని ఆరోపించారు. కుట్ర రాజకీయాలను ఇకనైనా మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా అమరావతి ఉద్యమం ఆగదని అనగాని సత్యప్రసాద్ స్పష్టంచేశారు.
తక్షణమే రైతులపై పెట్టిన అక్రమ కేసులన్నింటినీ ఎత్తివేసి వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని రాష్ట్రాలు అన్నదాతలకు సన్మానాలు చేస్తుంటే... వైకాపా ప్రభుత్వం మాత్రం సంకెళ్లు వేయటం సిగ్గుచేటని అనగాని సత్యప్రసాద్ దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: