అమరావతి కోసం ఉద్యమం చేస్తూ 10మంది రైతుల గుండెలు ఆగినా ముఖ్యమంత్రి గుండె మాత్రం కరగట్లేదని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. 347 రోజులకుపైగా ఉద్యమం చేస్తున్న రైతులతో ప్రభుత్వం చర్చించకపోగా.. వారికి పోటీగా పెయిడ్ ఆర్టిస్టులతో పేమెంట్ ఉద్యమం చేయించటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. మానవత్వం లేని పాలకులు కులాలు, మతాలను రెచ్చగొడుతూ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏడాదిన్నరగా అమరావతి నుంచి పాలన సాగించిన జగన్కు రాజధానిగా ఎందుకు పనికిరాదని అనగాని నిలదీశారు. అమరావతి విలువ తెలిసిన వారెవ్వరూ తరలింపుపై మాట్లాడరన్న అనగాని...జగన్ తన అహంకారం, అజ్ఞానం, అనాలోచిత నిర్ణయాలతో అమరావతిపై భస్మాసుర హస్తం పెట్టి రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేశారని ఆక్షేపించారు.
ఇదీ చదవండి: