పదవుల కేటాయింపుల్లో బీసీలను ప్రభుత్వం మోసం చేస్తోందంటూ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ జాబితాను విడుదల చేశారు. బడుగులకు 50 శాతం నామినేటెడ్ పదవుల పేరుతో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
ఉపకులపతులు, తిరుమల తిరుపతి దేవస్థానం, సలహాదార్లలో బీసీలకు అన్యాయం జరిగింది. జగన్ రెడ్డి కొండంత ప్రచారం చేసుకుంటూ గోరంత కూడా సాయం చేయలేదు. ప్రతిపక్షంలో ఉండగా బీసీలకు పెద్దపీట అంటూ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక కత్తి వేటు వేస్తూ ద్రోహం చేశారు. ప్రాధాన్యం ఉన్న పదవులు సొంత సామాజికవర్గానికి ఇస్తూ నామమాత్రపు పదవులు మాత్రమే బీసీలకు ఇచ్చారు. 50 శాతం జనాభా ఉన్న బీసీలు నామినేటెడ్ పదవులకు పనికిరారా?. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ కార్పొరేషన్లకు ఛైర్మన్లు ఉత్సవ విగ్రహాలే. నేతి బీరకాయలో నెయ్యి లేనట్లే కార్పొరేషన్లకు నిధులు లేవు- అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు
అచ్చెన్నాయుడు విడుదల చేసిన జాబితా
సంస్థ మొత్తం సభ్యులు సీఎం సామాజికవర్గం బీసీలు నామినేటెడ్ పదవులు 712 712 0 తితిదే 36 11 3 ఉపకులపతులు 12 10 1 సలహాదారులు 24 17 1 విప్ 8 4 1 ప్రభుత్వ న్యాయవాదులు 30 16 5 యూనివర్సిటీ ఈసీ సభ్యులు 116 32 4 యూనివర్సిటీ సెర్చ్ కమిటీ 12 9 1 తెదేపా పాలనపై విచారణ కమిటీ 9 6 0 వైద్యారోగ్య శాఖ సంస్కరణల కమిటీ 5 3 1 ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీ 6 4 0 వ్యవసాయ కమిషన్ 6 3 2 ప్రైవేట్ వర్సిటీ ప్రతిపాదన కమిటీ 5 2 0
ఇదీ చదవండి