ETV Bharat / city

తెదేపా కమిటీల ప్రకటన... బలహీన వర్గాలకు పెద్దపీట - తెలంగాణ తెదేపా కమిటీలు

తెలుగుదేశం పార్టీ నూతన కమిటీల్లో బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసింది. ఏపీ తెదేపా అధ్యక్షుడిగా కింజరాపు అచ్చెన్నాయుడును ఆ పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. తెదేపా తెలంగాణ అధ్యక్షుడిగా ఎల్.రమణకు వరుసగా మూడోసారి అవకాశం కల్పించారు. పొలిట్ బ్యూరోలో కొత్తగా 12 మందికి అవకాశం కల్పిస్తూ మొత్తం సభ్యుల సంఖ్యను 25కు విస్తరించారు. ముగ్గురు మహిళలకు జాతీయ ఉపాధ్యక్షులుగా కేంద్ర కమిటీలో చోటు కల్పించారు. 31 మందితో తెలంగాణ రాష్ట్ర కమిటీని నియమించిన చంద్రబాబు..., త్వరలోనే ఏపీ రాష్ట్ర కమిటీని నియమించనున్నారు.

Tdp
Tdp
author img

By

Published : Oct 19, 2020, 7:06 PM IST

Updated : Oct 19, 2020, 7:23 PM IST

తెలుగుదేశం పార్టీ నూతన కమిటీలను అధినేత చంద్రబాబు ప్రకటించారు. పార్టీ జాతీయ కమిటీతో పాటుగా పొలిట్ బ్యూరో, తెలంగాణ రాష్ట్ర కమిటీలు ఈ జాబితాలో ఉన్నాయి. బడుగు బలహీన వర్గాలకు ఈ కమిటీల్లో పెద్దపీట వేశారు. పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక కమిటీ పొలిట్ బ్యూరోలో గతంలో 12 మందికి మాత్రమే అవకాశం ఉండగా ఈ సారి 21 మందితో విస్తరించారు. ఎక్స్ అఫిషియో సభ్యులుగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, రెండు రాష్ట్రాల అధ్యక్షులు, పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్ కలిపి అదనంగా మరో నలుగురికి పొలిట్ బ్యూరోలో అవకాశం దక్కటంతో మొత్తంగా 25 మందితో పొలిట్ బ్యూరో ఏర్పాటైంది.

యువ నాయకత్వం-సీనియారిటీకి పొలిట్​ బ్యూరోలో సమ ప్రాధాన్యం కల్పించారు. ఈ విభాగంలో దాదాపు 60 శాతం పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించారు. కుల‌, మత, ప్రాంత‌, స‌మీక‌ర‌ణాల‌న్నీ పాటిస్తూనే క్యాడ‌ర్ అభిప్రాయాలు సేక‌రించి, అత్యధికులు సూచించిన వారినే పొలిట్‌బ్యూరోలోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

పొలిట్ బ్యూరోలో బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ, కళా వెంకట్రావ్, నక్కా ఆనంద్ బాబు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బోండా ఉమా, ఫరూఖ్, రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, అరవింద కుమార్ గౌడ్​లు ఉన్నారు. గత పొలిట్ బ్యూరోలో ఉన్న సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు, చింతకాయల అయ్యన్న పాత్రుడు, కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాలవ శ్రీనివాసులు, వర్ల రామయ్య, రావుల చంద్రశేఖర్ రెడ్డిలు తాజా జాబితాలో కొనసాగనున్నారు.

అచ్చెన్నకు రాష్ట్ర బాధ్యతలు

ఊహించినట్లుగానే పార్టీ శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చంద్రబాబు నియమించారు. ఉత్తరాంధ్ర బీసీ వర్గానికి చెందిన నాయకుడు కావడంతో ఆయనను అధ్యక్షుడిగా నియమించడం పార్టీ బలోపేతానికి దోహదం చేస్తుందన్న అభిప్రాయం నాయకుల్లో వ్యక్తమైనట్టు తెలుస్తోంది. పార్టీలో సీనియర్ నేతలు, క్యాడర్, యువ నేతల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే ఈ నియామకానికి అధినేత కూడా ఆమోదం తెలిపారు. తెలుగుదేశం పార్టీలో కింజారపు కుటుంబానిది కీలక పాత్ర. చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఎర్రన్నాయుడు కీలక నేతగా వ్యవహరించారు. దిల్లీ వ్యవహారాలు మొత్తం ఆయనే చూసేవారు. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన మరణం తర్వాత అచ్చెన్నాయుడు కూడా అదే స్థాయిలో చంద్రబాబుకి నమ్మినబంటుగా ఉన్నారు.

అచ్చెన్నాయుడి ప్రస్థానం

పార్టీ ఓటమి తర్వాత అసెంబ్లీలో శాసనసభాపక్ష ఉపనేతగా ఉన్న అచ్చెన్నాయుడు...ప్రభుత్వంపై వాగ్బాణాలు ఎక్కుపెట్టడంలో దిట్ట. 1996 ఉప ఎన్నిక ద్వారా రాజకీయాల్లోకి అచ్చెన్న ప్రవేశించారు. తన సోదరుడు ఎర్రన్నాయుడు శ్రీకాకుళం నుంచి పార్లమెంటుకి ఎన్నికవటంతో హరిశ్చంద్రపురం స్థానానికి ఉపఎన్నిక వచ్చింది. ఆ ఎన్నికల్లో సోదరుడు అచ్చెన్నాయుడు రాజకీయాల్లో ప్రవేశించారు. తర్వాత 1999, 2004 ఎన్నికల్లో హరిచంద్రపురం నుంచి 2014, 2019 టెక్కలి అసెంబ్లీ నుంచి అచ్చెన్న విజయం సాధించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా హరిచంద్రపురం రద్దు అవటంతో అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి పోటీ చేస్తున్నారు. వీరి కుటుంబం నుంచి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా, ఎర్రన్నాయుడు కుమార్తె భవాని రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే గాను, రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావును పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. పార్టీ నేతలతో చాలా సమన్వయంగా కళా పనిచేశారని చంద్రబాబు పలు సందర్భాల్లో కితాబిచ్చారు.

తెదేపా కేంద్ర కమిటీ

తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీని అధినేత చంద్రబాబు 27మందితో నియమించారు. ముగ్గురు సీనియర్ మహిళా నేతలతో కలిపి మొత్తం ఆరుగురుకి ఉపాధ్యక్షులుగా అవకాశం కల్పించారు. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నారా లోకేశ్​తో పాటు మొత్తం 8మంది ఉన్నారు. ఆరుగురు అధికార ప్రతినిధులు, ఇద్దరు కార్యదర్శులు, ఒక కోశాధికారి, నలుగురు క్రమశిక్షణ కమిటీ సభ్యులతో నూతన కార్యవర్గం ఏర్పాటైంది. ప్రతిభా భారతి, గల్లా అరుణకుమారి, డీకే సత్యప్రభలకు ఉపాధ్యక్షులుగాను, జ్యోత్స్న అధికారప్రతినిధిగా కలిపి మొత్తం నలుగురు మహిళలకు కేంద్ర కమిటీలో చోటు కల్పించారు. తెలంగాణ అశ్వరావుపేట ఎమ్మెల్యే ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మచ్చా నాగేశ్వరరావును పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా సముచిత స్థానం కల్పించారు. కేంద్రం కమిటీలో ఏడుగురు బీసీలు, ముగ్గురు ఎస్సీలు, ఒక ఎస్టీకు అవకాశం ఇచ్చారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా ప్రతిభా భారతి, గల్లా అరుణకుమారి, డీకే సత్యప్రభ, కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, మచ్చా నాగేశ్వరరావు, సీహెచ్ కాశీనాథ్​లను నియమించారు.

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నారా లోకేశ్​తో పాటు వర్ల రామయ్య, రామ్మోహన్ నాయుడు, నిమ్మల రామానాయుడు, బీదా రవిచంద్ర యాదవ్, కొత్తకోట దయాకర్ రెడ్డి, బక్కని నర్సింహులు, కంభంపాటి రామ్మోహన్ రావులు వ్యవహరిస్తారు. ఎమ్మెల్సీలు టీడీ జనార్థన్​ను రాజకీయ కార్యదర్శిగాను, అశోక్ బాబును కేంద్ర పార్టీ కార్యాలయ కార్యదర్శిగా నియమించారు. జాతీయ అధికార ప్రతినిధులుగా దీపక్ రెడ్డి, కొమ్మారెడ్డి పట్టాభిరామ్, మహ్మద్ నజీర్, ప్రేమ్ కుమార్ జైన్, జ్యోత్స్న, నన్నూరి నర్సిరెడ్డిలకు అవకాశం కల్పించారు. ఎమ్మెల్సీ బచ్చుల అర్జనుడు నేతృత్వంలోని క్రమశిక్షణ కమిటీలో సభ్యులుగా ముణిరత్నం, గుంటుపల్లి నాగేశ్వరరావు, బంటు వెంకటేశ్వరరావులు ఎంపికయ్యారు. పార్టీ కోశాధికారిగా మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్యను నియమించారు.

తెదేపా తెలంగాణ రాష్ట్ర కమిటీ

ఎల్. రమణ అధ్యక్షతన 31 మందితో తెలంగాణ రాష్ట్ర కమిటీని చంద్రబాబు నియమించారు. దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసినిని పార్టీ ఉపాధ్యక్షురాలిగా నియమించారు. ఆమెతో పాటు మరో 11మంది ఉపాధ్యక్షులుగా వ్యవహరించనున్నారు. మరో ఆరుగురు సభ్యులతో సమన్వయ కమిటీని నియమించారు. నందమూరి సుహాసిని, లక్ష్మణ్ నాయక్, అలీ మస్కటీ, భూపాల్ రెడ్డి, శ్రీశైలం, బండి పుల్లయ్య, గుండు సావిత్రమ్మ, గట్టు ప్రసాద్, గంథం గురుమూర్తి, వాసిరెడ్డి రామనాథం, తాజుద్దీన్, కాట్రగడ్డ ప్రసూనలు ఉపాధ్యక్షులుగా వ్యవహరించనున్నారు.

రాష్ట్ర పార్టీ కార్యదర్శులుగా జక్కలి ఐలయ్య యాదవ్, ఏకే గంగాధర్ రావు, గడ్డి పద్మావతి, రాజు నాయక్, గన్నోజు శ్రీనివాస చారీ, ప్రదీప్ చౌదరి, జీవీజీ నాయుడు, మహ్మద్ ఆరిఫ్, తాళ్లూరి జీవన్ లతో కలిపి మొత్తం 9 మందిని నియమించారు. రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధులుగా నల్లూరి దుర్గా ప్రసాద్, గుండు భూపేష్, చావా కిరణ్మయి, కరణం రామకృష్ణ, జె.ఇందిర, ఎం.శ్రీనివాసరెడ్డి, ఎం.రామేశ్వరరావు, శ్రీనివాస్ నాయుడు, రాజారెడ్డిలకు అవకాశం కల్పించారు. మరో ఆరుగురు సభ్యులతో రాష్ట్ర సమన్వయ కమిటీని నియమించారు. ఇందులో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఎల్.రమణతో పాటు రావుల చంద్రశేఖర్ రెడ్డి, కొత్తకోట దయాకర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, బక్కని నర్సింహులు, చిలువేరు కాశీనాథ్ లు సభ్యులుగా ఉంటారు.

జోడు పదవులు

పలువురు నేతలకు జోడు పదవులు లభించాయి. పార్టీ పొలిట్ బ్యూరోలో ఉన్న వర్ల రామయ్యకు జాతీయ ప్రధాన కార్యదర్శిగాను వ్యవహరించనున్నారు. తెలుగు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉన్న వంగలపూడి అనితకు పొలిట్ బ్యూరోలోనూ చోటు కల్పించారు. పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు అనంతపురం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులుగాను ఉన్నారు. ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యరాణి ఇప్పటికే అరకు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమెకు తాజాగా పొలిట్ బ్యూరోలోనూ అవకాశం కల్పించారు. రాజంపేట పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులుగా ఉన్న రెడ్డపగారి శ్రీనివాసరెడ్డీ పొలిట్ బ్యూరోలో చోటు దక్కింది.

ఇదీ చదవండి:

వైభవంగా శరన్నవరాత్రులు... గాయత్రీదేవిగా బెజవాడ దుర్గమ్మ

Last Updated : Oct 19, 2020, 7:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.