ETV Bharat / city

'ప్రవేశానికి సిద్ధంగా ఉన్న 6 లక్షల ఇళ్లను పక్కన పెడతారా?'

హౌస్ ఫర్ ఆల్ పథకం కింద తమ హయాంలో నిర్మించిన ఇళ్లను.. ప్రస్తుత వైకాపా ప్రభుత్వం పక్కన పెడుతోందని తెదేపా నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. నిర్మాణం పూర్తయిన గృహ సముదాయాలను పరిశీలించారు. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఇళ్లను ప్రభుత్వం విస్మరించటం... ప్రజాధనాన్ని దుర్వినియోగపరచడమేనని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం లబ్ధిదారులకు తక్షణమే ఇళ్లను అందించాలని డిమాండ్ చేశారు.

tdp activists protest state wide
tdp activists protest state wide
author img

By

Published : Jul 6, 2020, 5:54 PM IST

తెదేపా హయంలో నిర్మించిన ఎన్టీఆర్​ గృహాలను లబ్ధిదారులకు అందజేయకుండా ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై... ఆ పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఇళ్లను పక్కన పెట్టడం దారుణమన్నారు. గత ప్రభుత్వ హయాంలో అర్హులైన చాలా మందిని వివిధ కారణాలతో పక్కనపెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల గృహాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కానీ.. వైకాపా ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు దిగుతోందని దుయ్యబట్టారు. క్షేత్ర స్థాయిలో నిర్మించిన ఇళ్లను నేతలు పరిశీలించారు.

అర్హులకు కేటాయించండి

కడప జిల్లాలో తెదేపా హయాంలో నిర్మించిన ఎన్టీఆర్ గృహాలను తక్షణమే అర్హులైన వారికి కేటాయించాలని తెదేపా నేతలు గోవర్థన్ రెడ్డి, రెడ్యం వెంకటసుబ్బారెడ్డిలు డిమాండ్ చేశారు. కడప శివారులో నిర్మించిన ఎన్టీఆర్ గృహాలను నాయకులు పరిశీలించారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలను పక్కనబెట్టి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రజాధనాన్ని కాపాడండి

అనంతపురంలోని చిన్మయానగర్​లో హౌస్ ఫర్ ఆల్ పథకం కింద తెదేపా ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను తెదేపా నేతలు పరిశీలించారు. సిద్ధంగా ఉన్న ఇళ్లను ప్రభుత్వం పక్కన పెట్టడం సరికాదని... ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా కాపాడాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉన్న చోట ఇళ్లను కేటాయించకుండా దూరప్రాంతాల్లో స్థలాలు కేటాయిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

ఇళ్ల పట్టాల పేరుతో అవినీతి

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మున్సిపాలిటీ నిర్మించిన ఇళ్లను తెదేపా నేతలు పరిశీలించారు. టిడ్కో ద్వారా నిర్మించిన ఇళ్ల సముదాయాన్ని ఆ పార్టీ నేత ఉమామహేశ్వర్ నాయుడు సందర్శించారు. ప్రభుత్వం పేదల ఇళ్ల పట్టాల పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. తెదేపా హయాంలో నిర్మించిన ఇళ్లను తక్షణమే లబ్ధిదారులకు అందేలా చూడాలని కోరారు.

కక్షపూరిత ధోరణే

కదిరిలో తెదేపా నేతలు నిరసనకు దిగారు. గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన బహుళ అంతస్థులను లబ్ధిదారులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇళ్ల కోసం లబ్ధిదారులు డబ్బులు చెల్లించారని.. ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి నాణ్యతతో అన్ని సదుపాయాలతో పనులను చేపట్టారని గుర్తు చేశారు. కానీ వైకాపా ప్రభుత్వం... కక్షపూరిత ధోరణితో అర్థాంతరంగా ఆపేసిందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజాధనం నిరుపయోగంగా మారకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బలహీనవర్గాల కోసం నాడు తెదేపా ప్రభుత్వం చేపట్టిన గృహా నిర్మాణాలను వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని తూర్పుగోదావరి జిల్లా తెదేపా నేతలు ఆరోపించారు. ఆ పార్టీ సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావు పాలగుమ్మి, బి సావరం గ్రామాల్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. గత ప్రభుత్వం నిర్మించిన గృహ సముదాయాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేయడంలో ప్రభుత్వం తాత్సారాన్ని విడనాడాలని మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య డిమాండ్ చేశారు.

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణ శివార్లలో టిడ్కో ద్వారా నిర్మించిన 3400 ఇళ్ల సముదాయం వద్ద తెదేపా శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా సాలూరు మున్సిపాలిటీ పరిధిలో తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మించిన 1460 ఇళ్లను ఆ పార్టీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి పరిశీలించారు. అర్హులైన వారి పేర్లను తప్పించి... అనర్హులకు ఇళ్లను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి:

'నన్ను అవిటి వాడిని చేశారు... వారిని శిక్షించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.