ETV Bharat / city

ATCHANNAIDU: క్విడ్ ప్రోకో-2కి జగన్‌ తెరలేపారు: అచ్చెన్నాయుడు - ఏపీ తాజా వార్తలు

'సర్కారు వారి దొంగలు' పేరిట కొత్త పథకం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి జగన్.. అవినీతి కేసుల్లో సహనిందితులకు రాష్ట్రాన్ని దోచి పెడుతున్నారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాజశేఖర్‌రెడ్డి హయాంలో క్రిడ్‌ ప్రోకో అంటూ వేల కోట్లు దోచుకోగా.. ఇప్పుడు క్విడ్ ప్రోకో-2కు తెరలేపారని ధ్వజమెత్తారు.

TDP Achenna
TDP Achenna
author img

By

Published : Jun 16, 2021, 1:55 PM IST

జగన్ అవినీతి కార్యకలాపాలకు అప్పట్లో సహకరించి జెలుకెళ్లిన అధికారులకు పట్టిన గతే.. క్విడ్ ప్రోకో-2లో భాగస్వాములైన వారికీ పడుతుందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ముఖ్యమంత్రి కాగానే సరస్వతి సిమెంట్స్ లీజు గడువు పెంచుకున్న జగన్‌... తాజాగా ఇండియా సిమెంట్స్ లీజు గడువును ఏకంగా 50 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులిచ్చారని గుర్తుచేశారు. రెండేళ్ల జగన్ పాలనలో ప్రజలెవరికీ లబ్ధి చేకూరకపోయినా.. ఆయన కేసుల్లో సహ నిందితుల కంపెనీలు మాత్రం బాగుపడ్డాయన్నారు.

అరబిందో, హెటిరో సంస్థలకు కాకినాడ పోర్టు, అంబులెన్సు కాంట్రాక్టు, విశాఖ బేపార్క్ భూములు కట్టబెట్టారని.. రాంకీ ఫార్మా అధినేతకు రాజ్యసభకు సీటిచ్చారని దుయ్యబట్టారు. కర్నూలులో పెన్నా సిమెంట్స్ గనుల లీజును 2035 వరకు పొడిగించారని.. వాన్‌పిక్ సహనిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్‌ను సెర్బియాలో అరెస్టు చేస్తే, విడిపించేందుకు అనేక ప్రయత్నాలు చేశారని అన్నారు.

ఇదీ చదవండి: viveka murder case: వైఎస్ వివేకా హత్య కేసు..10వ రోజు సీబీఐ విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.