తెలంగాణ సిద్దిపేట జిల్లాలోని కోమటి చెరువు వద్ద పతంజలి ఆధ్వర్యంలో రూ.6 కోట్ల వ్యయంతో చేపట్టిన సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. 'బ్రిడ్జి మెన్ ఆఫ్ ఇండియా'గా పేరొందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత భరద్వాజ్ దీన్ని రూపొందించారు. మూడు నెలల్లోనే నిర్మాణాన్ని పూర్తి చేసినందుకు భరద్వాజ్ బృందాన్ని మంత్రి హరీశ్ అభినందించి సన్మానించారు. వీరితో పాటు కర్ణాటకకు చెందిన 30 మంది బృంద సభ్యులందరికీ కుక్కర్లను బహుమతిగా అందజేశారు.
500 మీటర్ల రోప్ గల ఈ బ్రిడ్జిపై ఒకేసారి 200 మంది నడవొచ్చని టూరిజం శాఖ వర్గాలు తెలిపాయి. కోమటి చెరువు- మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణలో భాగంగా అడ్వెంచర్ పార్కు వద్ద నిర్మిస్తున్న ఓపెన్ జిమ్, ఇతరత్రా సుందరీకరణ పనుల గురించి పర్యటక ఎండీ మనోహర్‌తో చర్చించారు. అనంతరం ఆధునికీకరణ పనులు మెుదలుపెట్టాలని ఎండీకి మంత్రి హరీశ్ రావు సూచించారు.
ఇవీ చూడండి : పోలవరంపై స్టే ఎత్తివేత