ETV Bharat / city

ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై.. మిగులు దెబ్బ - విద్యారంగంలో విచిత్ర వీరంగం

ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన హేతుబద్ధీకరణతో పోస్టులు భారీగా మిగిలిపోనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14 వేలకు పైగా పోస్టులు అదనంగా ఉన్నట్లు అధికారులు తేల్చారు. ప్రాథమిక బడుల్లో 30 మందికి ఒక్క టీచర్‌నే ఇవ్వగా.. 121 మంది కంటే ఎక్కువ ఉంటేనే ప్రధానోపాధ్యాయుడి పోస్టు కేటాయించారు. టీచర్ల సంఖ్యను తగ్గించే ప్లాన్‌తో ఇష్టారాజ్యంగా మార్పులు చేస్తోంది. రాష్ట్రంలో హేతుబద్ధీకరణతో మిగిలే ఉపాధ్యాయులను ఎలా సర్దుబాటు చేయాలన్నదానిపై పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

teacher posts
teacher posts
author img

By

Published : Jun 30, 2022, 4:05 AM IST

ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన హేతుబద్ధీకరణతో పోస్టులు భారీగా మిగిలిపోనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14 వేలకు పైగా పోస్టులు అదనంగా ఉన్నట్లు అధికారులు తేల్చారు. ప్రాథమిక బడుల్లో 30 మందికి ఒక్క టీచర్‌నే ఇవ్వగా.. 121 మంది కంటే ఎక్కువ ఉంటేనే ప్రధానోపాధ్యాయుడి పోస్టు కేటాయించారు. గతంలో 20మందికి ఒక్క ఉపాధ్యాయుడు ఉండగా.. దీన్ని 30 మంది విద్యార్థులకు పెంచారు. దీంతో ఎస్జీటీ పోస్టుల్లో భారీగా మిగులు ఏర్పడింది. దీనికితోడు ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల విలీనం వల్ల ఎస్జీటీ పోస్టుల సంఖ్య మరింత తగ్గింది. రాష్ట్రంలో 1, 2 తరగతుల్లో 30 మందిలోపు విద్యార్థులు ఉన్న బడులే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఒకే టీచర్‌తో సరిపెట్టారు. ఇది చదువు పునాదినే దెబ్బ తీస్తుంది. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయుడు సెలవు పెడితే బడి మూతపడాల్సిందే. ప్రాథమిక పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయిస్తామని గతంలో ప్రకటించిన ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. నాణ్యమైన విద్యను అందిస్తామని చెబుతూనే పోస్టులు తగ్గించడం, రద్దు చేయడానికే ప్రయత్నిస్తోంది. దీంతో విద్యా ప్రమాణాలు, నాణ్యత ఎలా పెరుగుతాయనేది ప్రశ్నార్థకం. జాతీయ విద్యా విధానం అమలు పేరుతో ప్రాథమిక పాఠశాలలను విచ్ఛిన్నం చేస్తోంది. కరికులమ్‌, బోధన విధానాలు అమలు కోసం 5+3+3+4 విద్యా విధానం తీసుకురాగా.. రాష్ట్రంలో మాత్రం తరగతులను భౌతికంగా విభజించేస్తున్నారు. ఇలా విభజించాల్సిన అవసరం లేదని కేంద్ర విద్యాశాఖ చెప్పినా పాఠశాలలు, ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించేందుకు దీన్ని అమలు చేస్తున్నారు.

భవిష్యత్తులో భర్తీకి ఏగనామం..
గత బదిలీల సమయంలో 15 వేల వరకు పోస్టులను బ్లాక్‌ చేశారు. ఈ స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. ఇప్పుడు సర్దుబాటులోనే ఉపాధ్యాయులు మిగులుతున్నందున భవిష్యత్తులో ఈ పోస్టుల భర్తీ ఇక ఉండదు. డీఎస్సీ-98 వారు 4,500 మంది వరకు ఉన్నారు. వీరికి ఒప్పంద పద్ధతిలో 1, 2 తరగతులు ఉండే బడుల్లో పోస్టింగ్‌ ఇవ్వాలని భావిస్తున్నారు. దీంతో రెగ్యులర్‌ ఎస్జీటీల సంఖ్య మరింత తగ్గిపోతుంది. ఇప్పటికే డీఎస్సీ-2008 వారికి ఒప్పంద పద్ధతిలో పోస్టింగ్‌లు ఇచ్చారు.

* 9, 10 తరగతుల్లో 60 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడిని కేటాయిస్తున్నారు. ఇంతకంటే విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉంటేనే రెండో సెక్షన్‌ చేయాలనే నిబంధన పెట్టారు. ఈ విధానంతో తరగతి గది విద్యార్థులతో కిక్కిరిసిపోతుంది. వెనుక ఉన్న విద్యార్థులకు పాఠాలు అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. 3-10 వరకు సబ్జెక్టు ఉపాధ్యాయులతో బోధన చేయిస్తామని చెబుతూనే మరోపక్క 6, 7, 8 తరగతులుండే ప్రాథమికోన్నత పాఠశాలల్లో 98 మంది కంటే తక్కువ విద్యార్థులుంటే ఎస్జీటీలనే కేటాయిస్తున్నారు. ఇదేక్కడి విధానమని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించడానికి ఇష్టారాజ్యంగా విధానాలను మార్పు చేస్తున్నారు.

ఒకే మాధ్యమంతో మరిన్ని రద్దు..
1-8 తరగతుల వరకు ఒకే ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేశారు. ఇప్పటి వరకు తెలుగు, ఆంగ్ల మాధ్యమం ఉండడంతో ఒకే పాఠశాలలో రెండు సెక్షన్లకు ఇద్దరేసి ఉపాధ్యాయులు ఉన్నారు. ఒకే మాధ్యమం చేయడంతో తెలుగు మాధ్యమం పోస్టులు రద్దవుతున్నాయి. దీంతో స్కూల్‌ అసిస్టెంట్ల పోస్టులు మిగులుతున్నాయి. రెండు మాధ్యమాల వారిని కలిపేసి పాఠం చెబితే పిల్లలకు ఎలా అర్థమవుతుందనే దాన్ని పట్టించుకోవడం లేదు. ఒక సెక్షన్‌కు ఒక్క ఉపాధ్యాయుడినే ఇస్తున్నారు. ఇది మరిన్ని పోస్టుల రద్దుకు దారి తీసింది.

* 3-10 తరగతులుండే ఉన్నత పాఠశాలల్లో 137 మంది, 6-10 తరగతుల బడిలో 92 మంది పిల్లలుంటే ప్రధానోపాధ్యాయ, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను తొలగించారు. ఇక్కడ ఉండే సీనియర్‌ స్కూల్‌ అసిస్టెంటే పాఠాలు బోధిస్తూ హెచ్‌ఎంగానూ వ్యవహరించాల్సి ఉంటుంది. ఒక ఉపాధ్యాయుడే పర్యవేక్షణ, తరగతి బోధన ఎలా చేయగలుగుతారు? ఇప్పటికే సబ్జెక్టు ఉపాధ్యాయులకు వారానికి 38-39 పీరియడ్‌ల వరకు వస్తున్నాయి. ఉపాధ్యాయుడికి ఖాళీ ఎక్కడ ఉంటుంది? పాఠం చెప్పేందుకు ఎప్పుడు సన్నద్ధమవుతారు? ఉన్నత పాఠశాలల్లో సీనియర్‌ ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయుడి విధులు ఎలా నిర్వహిస్తారు? సర్దుబాటు కోసం మార్పులు చేసేశారు.

ప్రపంచ బ్యాంకు నిబంధనే కారణమా?

రాష్ట్రంలో హేతుబద్ధీకరణతో మిగిలే ఉపాధ్యాయులను ఎలా సర్దుబాటు చేయాలన్నదానిపై పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రపంచ బ్యాంకుతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగానే ఈ ప్రక్రియ చేపట్టినట్లు విమర్శలు వస్తున్నాయి. ‘ఆంధ్ర అభ్యసన పరివర్తన’ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు రూ. 1,862 కోట్ల రుణం అందిస్తోంది. మానవ వనరులపై చేసే ఖర్చు తగ్గించుకోవాలన్నది ఈ ఒప్పందంలో ప్రపంచబ్యాంకు విధించిన షరతు. ఇందుకోసమే నూతన విద్యా విధానం పేరుతో ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలకు తరలింపు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేపట్టినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కిలోమీటరు పరిధిలోని ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత బడులకు తరలిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో మిగిలే 1, 2 తరగతుల్లో ఎక్కువచోట్ల 30 మంది లోపే పిల్లలు ఉంటున్నారు. 1:30 లెక్కన కేటాయిస్తే ఎస్జీటీ పోస్టులు మిగులుతున్నాయి. ప్రధానోపాధ్యాయుడి పోస్టు ఇచ్చేందుకు విద్యార్థుల సంఖ్యను ప్రామాణికం చేయడంతో కొన్నింటిలో ఈ పోస్టులూ రద్దవుతున్నాయి. ప్రాథమిక బడుల్లో మిగిలే 1, 2 తరగతులు ఉండే వాటిల్లో డీఎస్సీ-98 అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. అధికారిక లెక్కల ప్రకారం వీరు 4,500 మంది వరకు ఉన్నారు.

వందలకొద్దీ మిగులు పోస్టులు..

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హేతుబద్ధీకరణ ప్రక్రియ కారణంగా ఉపాధ్యాయ పోస్టులు భారీగా మిగిలిపోనున్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే వీటి సంఖ్య వందల్లో ఉంటోంది.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1,800, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఏకంగా 1,600 వరకు పోస్టులు ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు. కొన్ని జిల్లాల వివరాలివి..

* గుంటూరు జిల్లాలో సుమారు 1,800 ఎస్జీటీ, 140 వరకు ఎల్‌ఎఫ్‌ఎల్‌ ప్రధానోపాధ్యాయ పోస్టులు ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు. ఇక్కడ వెయ్యికిపైగా స్కూల్‌ అసిస్టెంట్లు అవసరం కానున్నట్లు గుర్తించారు. ఎస్జీటీ పదోన్నతులు కల్పించనున్నారు.

* ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,681 ఉపాధ్యాయ పోస్టులు అధికంగా ఉన్నట్లు అధికారులు తేల్చారు. 1,954 పోస్టులు మిగులు ఉండగా, 273 అవసరమవుతాయని నివేదికలో పేర్కొన్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న 61 ఉన్నత పాఠశాలలకు హెచ్‌ఎం పోస్టులు రద్దు చేయనున్నారు. ప్రాథమిక పాఠశాలల నుంచి కిలోమీటరు దూరంలోని ఉన్నత పాఠశాలలకు 3, 4, 5 తరగతులను తరలించేందుకు 473 బడులను గుర్తించారు.

* ఉమ్మడి అనంతపురం జిల్లాలో 1,600 పోస్టులు ఎక్కువ ఉన్నట్లు పేర్కొన్నారు. 3,793 పోస్టులు మిగులు ఉండగా, 2,193 పోస్టులు అవసరమని జాబితా రూపొందించారు. నిబంధనల ప్రకారం 14,219 పోస్టులు ఉండాల్సి ఉండగా.. ఇక్కడ 15,779 పోస్టులు మంజూరు చేసినట్లు చూపించారు.

* కడప జిల్లాలో ప్రాథమిక పాఠశాలల్లో హెచ్‌ఎంల పోస్టులు 293, ఎస్జీటీలు 1,749 మిగులు ఉన్నట్లు తేల్చారు. ఉన్నత పాఠశాలలకు వచ్చేసరికి 542 పోస్టులు అవసరమని పేర్కొన్నారు. ఇక్కడ ఎస్జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తే కొత్తగా నియామకాల అవసరం లేకపోగా.. ఇంకా పోస్టులు మిగులుతాయి.

* ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టులు, తెలుగు మాధ్యమంలో 147 పోస్టులు అధికంగా తేల్చారు. జిల్లావ్యాప్తంగా అన్ని కేటగిరీల్లో కలిపి 2,440 పోస్టులు అవసరమని నివేదించారు.

ఉపాధ్యాయ ఖాళీలను ప్రకటించాలి: ఎమ్మెల్సీ, విఠపు బాలసుబ్రహ్మణ్యంఇ

‘ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదు. హేతుబద్ధీకరణ, 3, 4, 5 తరగతుల విలీనంలో ఏం చేస్తున్నారో చెప్పడం లేదు. పాఠశాల విద్యాశాఖలో అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయో ప్రకటించాలి. వీటిని భర్తీ చేయకుండా హేతుబద్ధీకరణతో సర్దుబాటు చేయడం ఏంటి? పాఠశాలలకు పోస్టులు కేటాయించి, భౌతికంగా ఉపాధ్యాయుడిని ఇవ్వకపోతే ఏం లాభం?’

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.