హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తెరాస అభ్యర్థి సురభి వాణీదేవి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం తన తండ్రి, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు సమాధి వద్దకు వెళ్లి ఆమె నివాళులు అర్పించారు. ఆమె వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. పీవీకి సరైన గౌరవం ఇవ్వాలంటే వాణీదేవిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని మంత్రి తలసాని కోరారు. ఇతర పార్టీలు అభ్యర్థులను నిలపకుండా ఏకగ్రీవానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
నివాళులు అర్పించిన అనంతరం వాణీదేవి ప్రగతి భవన్ వెళ్లి.. ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు. నామినేషన్ వేసినప్పటి నుంచే విస్తృతంగా ప్రచారం చేసేలా తెరాస ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఇదీ చూడండి: తెలంగాణ: మేయర్, డిప్యూటీ మేయర్ల బాధ్యత స్వీకరణ నేడే...