గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్ షరతుల సడలింపు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గాలి జనార్దన్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. బళ్లారి, అనంతపురం, కడప వెళ్లకూడదన్న షరతులను సడలించాలని.. గాలి జనార్ధన్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2015 నుంచి ఇప్పటివరకు షరతులు ఉల్లంఘించలేదని ధర్మాసనానికి తెలిపారు. కుటుంబ సభ్యులు బళ్లారిలో ఉన్నారని.. అక్కడకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని గాలి జనార్దన్‌రెడ్డి.. సుప్రీంకోర్టును వేడుకున్నారు.
గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్ షరతులను సడలించవద్దని సీబీఐ వాదించింది. బళ్లారిలో చాలామంది సాక్షులు ఉన్నారనీ.. జనార్దన్‌రెడ్డి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ సుప్రీం కోర్టుకు తెలిపింది. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీం.. తీర్పును రిజర్వు చేసింది.
ఇదీ చదవండి: కృష్ణపట్నం పోర్టులో అదానీ గ్రూప్ 100% పెట్టుబడులు