మంత్రి ఆదిమూలపు సురేశ్ అక్రమాస్తుల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ కేసు కొనసాగింపుపై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. మంత్రి సురేశ్ దంపతులపై గతంలో సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్‌ఐఆర్ కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేసింది సీబీఐ.
విచారణ సందర్భంగా ఈ కేసులో ఇప్పటికే 111 మంది సాక్షులను విచారించామని సీబీఐ.. న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. మరో 3 నెలల్లో విచారణ పూర్తి చేస్తామని తెలిపింది. ఛార్జ్‌షీట్ దాఖలు తర్వాత నిర్ణయం తీసుకోవాలని కోరింది. క్షక్ష సాధింపునకే సీబీఐ విచారణ చేపట్టిందని సురేశ్ దంపతులు తరపు న్యాయవాదులు వాదించారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది.
ఇదీ చదవండి