జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ సంభాషణ కేసులో ఏపీ హైకోర్టు ఆదేశించిన దర్యాప్తు అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసుపై సుప్రీంలో ఇవాళ విచారణ జరిగింది. పిల్ నిర్వహణపై తప్ప హైకోర్టు ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేదని సుప్రీం ధర్మాసనం వివరించింది. హైకోర్టులో దాఖలైన పిల్ మెరిట్స్ జోలికి తాము వెళ్లట్లేదని సుప్రీం స్పష్టం చేసింది. పిల్ మెయింటైనబిలిటీని హైకోర్టు పరిగణించాలని సూచించింది. ఈ మేరకు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్‌రెడ్డితో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది.
ఇదీ చదవండి: దేశ్‌ముఖ్‌కు సుప్రీంలో షాక్- పిటిషన్ కొట్టివేత
సస్పెండ్ అయిన మున్సిఫ్ మెజిస్ట్రేట్ రామకృష్ణ, జస్టిస్ ఈశ్వరయ్యల మధ్య సంభాషణలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై కుట్రకు పథకం పన్నినట్లు స్పష్టమవుతున్నందున.. వాస్తవాల నిర్ధారణకు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్.వి.రవీంద్రన్‌తో విచారణ కమిటీని ఏర్పాటుచేస్తూ రాష్ట్ర హైకోర్టు గతంలో తీర్పు చెప్పింది. ధర్మాసనం ఉత్తర్వులపై స్టే కోరుతూ జస్టిస్ ఈశ్వరయ్య సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి