ETV Bharat / city

ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు సుప్రీంలో ఊరట.. నోటీసులపై 'స్టే'

గొట్టిపాటి గ్రానైట్ కంపెనీకి ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసు(MLA gottipati ravikumar show cause notices case news)పై స్టే విధించింది సుప్రీంకోర్టు. ఈ మేరకు కోర్టు ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.

MLA gottipati ravikumar
MLA gottipati ravikumar
author img

By

Published : Oct 25, 2021, 5:52 PM IST

Updated : Oct 25, 2021, 6:20 PM IST

తెదేపా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గొట్టిపాటి గ్రానైట్ కంపెనీకి ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసు(MLA gottipati ravikumar show cause notices case news)పై స్టే విధించింది(supreme court gives stay on MLA gottipati ravikumar case news). ఈ మేరకు సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ..

గొట్టిపాటికి చెందిన గ్రానైట్ కంపెనీలో అవకతవకలు జరిగాయని విజిలెన్స్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ మేరకు రూ.50 కోట్లు జరిమానా విధిస్తూ ప్రభుత్వం షోకాజ్‌ నోటీసులిచ్చింది. ఈ నోటీసులపై గొట్టిపాటి హైకోర్టును ఆశ్రయించగా.. సింగిల్ జడ్జి బెంచ్ నోటీసులను కొట్టివేసింది.ఈ నిర్ణయంపై ప్రభుత్వం డివిజన్ బెంచ్​కు వెళ్లింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ పక్కన పెట్టింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్.. సుప్రీంను ఆశ్రయించారు. కంపెనీలో అవకతవకలపై విజిలెన్స్ సిఫారసు చట్ట విరుద్ధమని ఆయన తరపు న్యాయవాది వాదించారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వ షోకాజ్ నోటీసుపై స్టే విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

ఇదీ చదవండి: CM Jagan Review: ఉద్యోగ కల్పన దిశగా విద్యాప్రమాణాలు మెరుగుపరచాలి: సీఎం జగన్

Last Updated : Oct 25, 2021, 6:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.