పులిపోసే కాదు పులిబల్లిగా కూడా..
మన్యంలో ఉండే ప్రజలు ఈ విష జీవిని 'పులిపోస'గా పిలుస్తారు. శరీరంపై పులిచారలు కలిగి ఉండడం వల్ల దీనిని 'పులిబల్లి' అని కూడా అంటారు. ఇవి కొండ తొర్రల్లో నివసిస్తాయి. వర్షాలు, తేమ ఉన్న సందర్భాల్లో రాత్రి వేళ్లలో ఎక్కువగా బయటకు వస్తాయి. కొండ గట్ల వద్ద తిరిగే వారు వీటి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
నిమిషాల్లోనే ప్రాణం పోతుంది
ఈ పులిబల్లి కరిస్తే మనిషి కేవలం పది నిమిషాల్లోనే హఠాత్తుగా చనిపోతాడు. కనీసం ప్రాథమిక చికిత్స చేసే సమయం కూడా ఉండదు. ఏమి జరిగిందో అని తెలుసుకునే లోపే ప్రాణాలు పోతాయి. ఈ పులిపోసలతో అత్యంత జాగ్రత్తగా ఉండాలని స్థానికులు హెచ్చరిస్తున్నారు. మన్యంలో ఇలాంటి విష జీవుల బారిన పడి ఎంతో మంది ఆకస్మిక మరణాలకు గురవుతుంటారు. అధికారులు ఇలాంటి జీవుల గురించి అక్కడి ప్రజల్లో అవగాహన కల్పించి... మన్యం వాసుల విలువైన ప్రాణాలు కాపాడేలా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇదీ చదవండి: