ETV Bharat / city

రాష్ట్రంలో స్వయం ఉపాధి రుణాలకు మంగళం..! - స్వయం ఉపాధి రుణాలకు మంగళం

రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి రుణాలకు మంగళం పలికింది. వైకాపా అధికారం చేపట్టిన నాటినుంచి రాష్ట్రంలోని సంక్షేమ కార్పొరేషన్ల నుంచి ఎలాంటి రుణాలు ఇవ్వలేదు. దీంతో నిరుద్యోగ యువతతో పాటు ఆయా వర్గాల వారికి స్వయం ఉపాధి మాటే లేకుండా పోయింది. ఉపాధి లేక తీవ్ర ఇబ్బంది పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. రుణాలు మంజూరు చేస్తే స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకుని జీవన చక్రాన్ని ముందుకు నడిపించవచ్చని నిరుద్యోగులు భావిస్తున్నారు.

no Self Employment schemes
స్వయం ఉపాధి రుణాలకు మంగళం
author img

By

Published : Mar 13, 2021, 4:43 PM IST

రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి రుణాలకు మంగళం పలికింది. రెండేళ్లుగా నిరుద్యోగ యువతతో పాటు ఆయా వర్గాల వారికి స్వయం ఉపాధి కోసం పైసా విడుదల చేయలేదు. కనీసం కార్యాచరణ ప్రణాళికను సైతం చేర్చలేదు. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో వైకాపా విజయం సాధించిన తర్వాత ఏర్పడిన మంత్రి మండలి స్వయం ఉపాధి పథకాన్ని నిలిపివేసింది. జిల్లాలో అంతకుముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కార్పొరేషన్ల ద్వారా 18 నుంచి 50 సంవత్సరాల లోపు వారికి రుణాలను విడుదల చేయడంతో వారు స్వయం ఉపాధి, సూక్ష్మ పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని ఉపాధిని పొందేవారు.

ప్రస్తుత ప్రభుత్వం 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో సంక్షేమ కార్పొరేషన్ల నుంచి ఎలాంటి రుణాలు ఇవ్వలేదు. వీటి కోసం కేటాయించిన నిధులను నవరత్నాల కార్యక్రమంలోని పథకాలకు నిధులను బదిలీ చేసి ఖర్చు చేస్తున్నారు. నవరత్నాల్లో ఎంపికైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగుల లబ్ధిదారుల వివరాలను రాష్ట్ర సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శుల కార్యాలయాలకు పంపిన తర్వాత జిల్లా కార్పొరేషన్లకు జాబితాలను పంపి నిధులను కేటాయించేలా ప్రతిపాదనలను పంపుతున్నారు. ఇక్కడ లబ్ధిదారుల ఎంపికలోనూ జిల్లా స్థాయిలో ఎలాంటి పాత్ర లేదు. దీంతో స్వయం ఉపాధి మాటే లేకుండా పోయింది.

నవరత్నాల్లో భాగంగా జగనన్న అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్సార్‌ రైతు భరోసా, పింఛన్లు, చేయూత, చేనేత నేస్తం పథకాల్లో ఎంపిక చేసిన లబ్ధిదారులకు సంక్షేమ కార్పొరేషన్ల నుంచి నిధులను కేటాయించి ఖర్చు చేస్తున్నారు. ఈ పథకాలకు ఆయా శాఖల బడ్జెట్‌ నుంచి ఖర్చు చేయాల్సి ఉండగా కార్పొరేషన్ల నిధులను వెచ్చించడంతో స్వయం ఉపాధి పథకం పూర్తిగా మరుగున పడిపోయింది. 2018-19, 2019-20 సంవత్సరాల్లో ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో సుమారు ఐదు వేల మందికి ఇప్పటికీ రుణాలు విడుదల చేయని పరిస్థితి. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో బ్యాంకర్లు సైతం రుణాలు విడుదల చేసేందుకు మొగ్గు చూపడం లేదు.

తిరిగి ప్రారంభించేలా చూడాలి..

2020-21 ఆర్థిక సంవత్సరం మార్చి 30తో ముగియనుంది. దీంతో ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల్లో నిధులు సర్దుబాటు చేసి రానున్న 2021-21 ఏడాదిలో బడ్జెట్‌కు ప్రతిపాదనలు రూపొందించనుంది. ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే నూతన ఆర్థిక సంవత్సరం లోనైనా స్వయం ఉపాధికి రుణాలను కేటాయించేలా చూడాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

ఓవైపు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదల చేయకపోవడం, ఇంకోవైపు ఏడాది కాలంగా కరోనా మహమ్మారితో ప్రైవేటు రంగంలో చేస్తున్న ఉద్యోగాలు కోల్పోయి ఉపాధి దూరమవడంతో నిరుద్యోగులుగా మారారు. ఇలాంటి పరిస్థితుల్లో సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేస్తే స్వయం ఉపాధి యూనిట్లను ఏర్పాటు చేసుకుని జీవన చక్రాన్ని ముందుకు నడిపించవచ్చని నిరుద్యోగులు భావిస్తున్నారు. జిల్లాకు చెందిన రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరితతో పాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి నిరుద్యోగుల సమస్యలను తీసుకెళ్లి స్వయం ఉపాధి పథకాన్ని తిరిగి ప్రారంభించేలా చూడాలని కోరుతున్నారు. ప్రజాప్రతినిధులు ఏ మేరకు స్పందిస్తారనేది వేచి చూడాల్సిందే. - జిల్లాపరిషత్తు(గుంటూరు)

ఇదీ చూడండి:

వందశాతం ప్లేస్​మెంట్స్​తో విశాఖ ఐఐఎం సత్తా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.