పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కోరిన నివేదికను ప్రభుత్వం సోమవారం సమర్పించనుంది. ప్రధాన మంత్రి కార్యాలయం సూచన మేరకు ఆ శాఖ వివరణలు కోరిన విషయం తెలిసిందే. ఇప్పటికే జలవనరులశాఖాధికారులు పూర్తి స్థాయి నివేదికను సిద్దం చేశారు. ముసాయిదా ప్రతిపై ఉన్నతస్థాయిలో పరిశీలన జరుపుతున్నారు. ఏమైనా మార్పులు చేర్పులుంటే చేసి సోమవారం స్వయంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు అందించనున్నారు.
ఇవీ చదవండి