రాజధాని బిల్లులపై హైకోర్టు స్టే ఇవ్వడంపై. ప్రభుత్వం సుప్రీంకోర్టు గడప తొక్కింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు అంశంపై హైకోర్టు స్టే ఇవ్వగా.. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో స్టే వెకేషన్ పిటిషన్ వేసింది. తమ వాదనలూ వినాలని రాజధాని రైతులు, అమరావతి ఐకాస కేవియట్ వేశారు.
పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై... కొన్నిరోజుల కిందట గవర్నర్ సంతకం చేశారు. ఐతే ఈ అంశాలపై పలు వ్యాజ్యాలు హైకోర్టులో ఉన్నందున.. ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టకూడదంటూ.. ఈ నెల 14 వరకూ హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఇదీ చదవండి: సహాయక చర్యల్లో పాల్గొన్నవారికి కొవిడ్ పరీక్షలు