fisheries Director: తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ చెందిన మారమ్మ.. వైకాపాకు, ముఖ్యమంత్రి జగన్కు వీరాభిమాని. మారుమూల గ్రామంలో ఉన్న ఆమె పార్టీ కోసం పడ్డ కష్టం గుర్తించి స్వయంగా ముఖ్యమంత్రి జగనే గుర్తించి రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్ పదవి కట్టబెట్టారు. కానీ... అంతటి పదవి ఉన్నా స్థానికంగా నియోజకవర్గ వ్యాప్తంగా తనను ఎవరూ గౌరవించడంలేదని, పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ పరంగా ఏ కార్యక్రమం జరిగినా తనకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని వాపోయారు. కార్యక్రమాల ఫ్లెక్సీల్లో తన ఫొటో కూడా వేయడం లేదన్నారు. కావాలనే స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు దూరం పెడుతున్నారని కన్నీరు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ వద్ద జిల్లాలో ఎవరికీ లేని గుర్తింపు తనకు ఉందని.. ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. సోమవారం నాడు-నేడు కార్యక్రమంలో పాల్గొన్న మారమ్మ మీడియాతో మాట్లాడారు.
ఇదీ చదవండి: ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు స్వాధీనం