ETV Bharat / city

రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డికి రాష్ట్రపతి ఉత్తమ పోలీస్‌ సేవా పతకం - AP Latest news

రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డికి రాష్ట్రపతి ఉత్తమ పోలీస్‌ సేవా పతకం లభించింది. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ వేడుకల వేళ కేంద్ర హోం శాఖ ఈ అవార్డును ప్రకటించింది. విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించినందుకు ఉత్తమ సేవలు–2020 సంవత్సరానికి ఈ పురస్కారం దక్కింది

DGP
DGP
author img

By

Published : Aug 15, 2022, 8:26 AM IST

DGP KV Rajendranath Reddy: రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డికి రాష్ట్రపతి ఉత్తమ పోలీస్‌ సేవా పతకం (President Medal) లభించింది. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ వేడుకల వేళ కేంద్ర హోం శాఖ ఈ అవార్డును ప్రకటించింది. విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించినందుకు ఉత్తమ సేవలు–2020 సంవత్సరానికి ఈ పురస్కారం దక్కింది. ఈ పతకాన్ని ముఖ్యమంత్రి జగన్‌ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అందజేయనున్నారు. రిటైర్డ్‌ ఏఎస్పీ నల్లమిల్లి వెంకటరెడ్డి తన సర్వీస్‌ కాలంలో అందించిన ఉత్తమ సేవలకు కేంద్ర హోం శాఖ ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ ప్రకటించింది. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ 1989 బ్యాచ్‌కు చెందిన వెంకటరెడ్డి పోలీస్‌ శాఖలో విశిష్టమైన సేవలందించారు. సబ్‌ ఇన్‌స్పెక్టర్, ఇన్‌స్పెక్టర్, డీఎస్పీ, అడిషనల్‌ ఎస్పీగా అనేక హోదాల్లో విధులు నిర్వర్తించారు.

ముగ్గురికి శౌర్య, ఇద్దరికి పోలీసు సేవా పతకాలు

ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శిక్షణ విభాగం ఐజీ, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పి.వెంకట్రామిరెడ్డికి రాష్ట్రపతి పోలీసు పతకం లభించింది. గ్రేహౌండ్స్‌ విభాగం అసిస్టెంట్‌ అసాల్ట్‌ కమాండర్‌ మండ్ల హరికుమార్‌, జూనియర్‌ కమాండోలు ముర్రే సూర్యతేజ, పువ్వల సతీష్‌లకు శౌర్య పతకాలు వరించాయి. ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ విభాగం రిజర్వు ఇన్‌స్పెక్టర్‌ జె.శాంతారావు, స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఎస్సై నారాయణమూర్తికి పోలీసు సేవా పతకాలు లభించాయి. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్రంలో మొత్తం ఆరుగురు పోలీసు అధికారులకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఈ పతకాలు ప్రకటించింది.

* ముంబయి పోర్టులో సీఐఎస్‌ఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తించే శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన లఖినాన కేశవరావు 2020 ఏడాదికిగాను రాష్ట్రపతి పోలీసు పతకానికి ఎంపికయ్యారు. కేశవరావు 1982లో సెక్యూరిటీ గార్డుగా విధుల్లో చేరారు. 1997 గణతంత్ర దినోత్సవంలో పోలీసు మెడల్‌ కూడా అందుకున్నారు.

* నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఎన్‌.సుబ్బారావు ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌కు ఎంపికయ్యారు. సోమవారం దిల్లీలో జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి ఈ పురస్కారం అందుకోనున్నారు. సుబ్బారావు సికింద్రాబాద్‌ జోనల్‌ పోలీస్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో ఇన్‌స్రక్టర్‌గా (ఏఎస్‌ఐ) పనిచేస్తున్నారు.

.
.

ఇవి చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.