ETV Bharat / city

'ఏపీలో మత రాజకీయాలు ప్రజాస్వామ్యానికి విఘాతం' - భాజపా నాయకులపై చాడ విమర్శలు

ఏపీలో విగ్రహాల కూల్చివేతను పార్టీలు రాజకీయం చేస్తున్నాయని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రజలకు ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. తమ పార్టీ నేత నారాయణపై భాజపా నేత లక్ష్మణ్​ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

state-cpi-secretary-chada-venkatreddy-criticized-on-bjp
సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి
author img

By

Published : Jan 5, 2021, 2:45 PM IST

"మత రాజకీయాలు చేసే భాజపాకు సీపీఐను విమర్శించే నైతిక హక్కు లేదు" అని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​ రెడ్డి అన్నారు. ఏపీలో విగ్రహాల ధ్వంసంపై పార్టీలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. తాము ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుంటే... తెలంగాణలో సీపీఐ "టు లెట్" బోర్డు పెట్టుకోవాలని లక్ష్మణ్ మాట్లాడటంపై.. చాడ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే లక్ష్మణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎన్ని ఇబ్బందులు వచ్చినా దిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నారని.. వారి విషయంలో.. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చాడ ఆగ్రహించారు. రైతుల ఉద్యమానికి సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. నిన్నటి వరకు రైతుల పక్షాన మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... రాష్ట్రంలో రైతు కొనుగోలు కేంద్రాలను ఎత్తి వేయడం అంటే కేంద్ర చట్టాలను సమర్థించడమేనని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:

రాష్ట్రంలో ఆలయాలపై దాడులు.. మత మార్పిడులు అరికట్టాలి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.