ఉన్నత విద్యా సంస్థలకు ఉమ్మడి అకడమిక్ క్యాలెండర్‌ను ఉన్నత విద్యామండలి రూపొందించింది. డిగ్రీ, పీజీ చదివే రెండు, మూడు సంవత్సరాల విద్యార్థులకు ఆగస్టులో తరగతులు ప్రారంభం కానున్నాయి. మొదటి ఏడాది విద్యార్థులకు సెప్టెంబరులో తరగతులుంటాయి. కరోనా కారణంగా విద్యా సంవత్సరం ప్రారంభంలో జాప్యం జరిగినందున తరగతుల సమయాన్ని రోజుకు గంట నుంచి రెండు గంటల వరకు పెంచనున్నారు.
ప్రతి శనివారం సెలవులు లేకుండా తరగతులు నిర్వహిస్తారు. పండగల సెలవులను తగ్గించనున్నారు. ఆగస్టు నుంచి మే వరకు కళాశాలలు, వర్సిటీలు పనిచేసేలా అకడమిక్ క్యాలెండర్ రూపొందించారు. 2021-22 విద్యా సంవత్సరం యథావిధిగా ఉండేలా ప్రణాళిక రూపొందించారు. జులైలో డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ చివరి ఏడాది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. మిగతా విద్యార్థులకు తరగతులు ప్రారంభించాక నిర్వహించడంపై ఆలోచిస్తున్నారు. ఇంజినీరింగ్ సీట్లకు ఆగస్టులో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత సెప్టెంబరులో డిగ్రీ మొదటి ఏడాది ప్రవేశాలు నిర్వహిస్తారు. డిగ్రీ కళాశాలలకు ఉమ్మడి బోధన రుసుముల ఖరారుపై ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ కసరత్తు చేస్తోంది.
ఇదీ చదవండి: