రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరద ప్రభావిత జిల్లాల్లో(floods in andhraprades) బాధితులను ఆదుకునేందుకు భాజపా ప్రత్యేక కార్యక్రమానికి సిద్ధమైంది. సహాయం చేయడానికి వీలుగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ నెల 25, 26 తేదీల్లో పార్టీ శ్రేణులు జోలె పట్టి నిధులు సేకరించాలని(ap bjp collect donations for flood victims) ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపునిచ్చారు. ఆయా ప్రాంతాల్లో పార్టీ బృందాల ద్వారా బాధితులను ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
వరదల బీభత్సంతో సీమ జిల్లాలో వేలాది మంది నిరాశ్రయులయ్యారని సోము వీర్రాజు(somu veerraju on flood victims) ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకోవటంలో రాష్ట్ర సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో పార్టీ శ్రేణులకు ఉన్న సేవా దృక్పథంతో ప్రజల్లోకి వెళ్లి జోలె పట్టి వస్తు, నగదు రూపంలో నిధులు సేకరించాలని కోరారు. బాధితులకు పంపిణీ చేసి అండగా నిలవాలన్నారు. ఈ నెల 26న విజయవాడలో తలపెట్టిన భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశం వాయిదా వేస్తున్నట్లు సోము వీర్రాజు తెలిపారు.
ఇదీ చదవండి: