గడచిన 2 నెలల్లో దాదాపు 600 కోట్ల రూపాయల ఆదాయాన్ని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కోల్పోయింది. లాక్‌డౌన్ నిబంధనల వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లు, స్థలాల క్రయవిక్రయాలు స్తంభించాయి. 2019-20 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి మే 29 వరకు 740.24 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అదే సమయానికి వచ్చిన ఆదాయం 171.63 కోట్ల రూపాయలే. లాక్‌డౌన్ వేళ కృష్ణా, గుంటూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఆదాయం బాగా పడిపోయింది.
21 నుంచి పునః ప్రారంభం
నిబంధనల్లో మినహాయింపులు ఇవ్వడంతో 21 నుంచి రిజిస్ట్రేషన్లు పునః ప్రారంభమయ్యాయి. తొలుత రోజుకు రూ.5 కోట్ల విలువైన రిజిస్ట్రేషన్లు జరిగాయి. ప్రస్తుతం రోజుకు 10 కోట్ల నుంచి రూ.15 కోట్ల రూపాయల విలువైనవి సాగుతున్నాయి. ఇప్పటివరకు 169.74 కోట్ల రూపాయలు వచ్చింది. శుక్రవారం లభించిన ఆదాయం 14.51 కోట్ల రూపాయలు. విశాఖ, కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో పరిస్థితి బాగా మెరుగైంది.
కిందట ఏడాది, ఈ ఏడాది వచ్చిన ఆదాయం
జిల్లా పేరు | 2019 ఏప్రిల్ నుంచి మే 29 వరకు (అంకెలు రూ.కోట్ల రూపాయాల్లో) | 2020 ఏప్రిల్ నుంచి మే 29 వరకు (అంకెలు రూ.కోట్ల రూపాయాల్లో) | వృద్ధి (శాతం) |
శ్రీకాకుళం | 20.48 | 11.59 | -43.43 |
విజయనగరం | 29.86 | 8.70 | -70.87 |
విశాఖపట్నం | 102.09 | 24.45 | -76.05 |
తూర్పు గోదావరి | 76.01 | 23.67 | -68.85 |
పశ్చిమ గోదావరి | 62.95 | 18.22 | -71.06 |
కృష్ణా | 101.23 | 15.77 | -84.43 |
గుంటూరు | 111.44 | 16.13 | -85.52 |
ప్రకాశం | 28.91 | 9.85 | -65.92 |
నెల్లూరు | 36.55 | 7.24 | -80.18 |
చిత్తూరు | 47.38 | 11.33 | -76.10 |
కడప | 31.61 | 3.81 | -87.95 |
అనంతపురం | 44.44 | 7.82 | -82.40 |
కర్నూలు | 47.29 | 13.05 | -72.41 |
ఇదీ చదవండి: నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునర్నియామక ఉత్తర్వులు వెనక్కి