జగనన్న తోడు పథకం ద్వారా రుణం పొందే లబ్ధిదారులకు స్టాంపు డ్యూటీని మినహాయిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రుణ మంజూరుకు బ్యాంకులు వసూలు చేసే డాక్యుమెంటేషన్ స్టాంపు డ్యూటీ రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో పది లక్షల మందికి లాభం కలుగుతుందని గ్రామ, వార్డు సచివాలయ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. రుణగ్రహీతలు ఒక్కొక్కరికి రూ.324 చొప్పున.. మొత్తంగా 32 కోట్లు ప్రభుత్వం భరిస్తుందని ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి: 'భూయాజమాన్య చట్టం'పై కేంద్రం అభ్యంతరాలు