తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా హత్నూర మండల సమీపంలో గల బడేంపేట గ్రామ సమీపంలోనిది ఈ ఇల్లు.. ఈ చిత్రాలు చూస్తే పాత పెంకుటిల్లు అనిపిస్తుంది. సహజ సిద్ధంగా నిర్మించిన భవనం ఇది. మట్టి సున్నం, ఆవు పేడ, వరి గడ్డి, ముడిసరకును పశువులతో బాగా తొక్కించి... వచ్చిన మిశ్రమంతో దీనిని నిర్మించారు.
ఇంటి నిర్మాణానికి వెదురు కర్రలు, గ్రానైటు రాయిని వినియోగించారు. ఆ ఇంటికి మరో ప్రత్యేకత ఉంది. చలికాలం, వర్షకాలం వస్తే... లోపల వెచ్చగానూ... వేసవి కాలంలో చల్లగానూ ఉంటుంది. ఫ్యాన్లు అవసరం ఉండదు. విద్యుత్ వాడకం కూడా చాలా తక్కువ. ఇందుకోసం ప్రత్యేకంగా పెద్దవి, చిన్నవి కిటికీలు ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చిన వారు పాత ఇల్లు అనుకుంటారు. లోపలికి వెళ్తే... ఓ అద్భుతమైన అనుభూతికి లోనవుతారు.
2016 లో ఆక్సి స్వచ్ఛంద సంస్ధ వారు సమావేశాలు నిర్వహించుకోవడానికి కూడలి పేరుతో ఇంటిని నిర్మాణం చేశారు. ఇందుకోసం హిమాచల్‌ప్రదేశ్ నుంచి నిర్మాణ నిపుణులను తెప్పించి దీనిని నిర్మాణం చేశారు. ఒకసారి లోపలికి వెళ్తే... ఎవరైనా ఔరా అనాల్సిందే మరి. అలా ఉంది ఈ ఇంటి నిర్మాణం.
ఇదీ చూడండి: