ETV Bharat / city

ఆ వాలంటీర్​ కర్తవ్యం ముందు...పెద్దవాగు చిన్నబోయింది

సమాజానికి సేవ చేయాలనే కోరిక... ఆ యువతికి ధైర్యాన్ని నేర్పింది. సమయపాలన పాటించాలన్న ఆమె పట్టుదల సాహసాలు చేసేలా చేసింది. ఉదయం 6 గంటలకే పింఛన్లు పంపిణీ చేయాలనే లక్ష్యం ముందు... పెద్ద వాగు చిన్నబోయింది. ఆ వివరాలు మీ కోసం.

gumminthamthanda volunteer savitribai
gumminthamthanda volunteer savitribai
author img

By

Published : Oct 5, 2020, 7:44 PM IST

Updated : Oct 5, 2020, 8:01 PM IST

ముదిచేర సావిత్రిబాయి... కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమితంతండా వాసి. టీటీసీ పూర్తి చేసిన సావిత్రిబాయి... 2019 ఆగస్టు 15వ తేదీన బ్రాహ్మణపల్లి పంచాయతీ గ్రామవాలంటీర్​గా చేరింది. నాటి నుంచి తనకు కేటాయించిన వార్డులో క్రమం తప్పకుండా పింఛన్లు ఇవ్వటం సహా ఇతర ప్రభుత్వ సేవలను చేరువ చేయటంలో శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.

ప్రమాదకరమని వారించినా....

అక్టోబర్ ఒకటో తేదీనే అవ్వాతాతలకు పింఛన్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అంతకుముందు రోజు సావిత్రిబాయి పింఛన్ల సొమ్ము 60 వేల రూపాయలు తీసుకుని ఇంటికి వెళ్లింది. రాత్రి వర్షం మొదలైంది. వేకువజామునే పింఛన్లు ఇవ్వాలని సిద్ధమైంది. అందుకోసం తన స్వగ్రామం గుమితంతాండా నుంచి బ్రాహ్మణపల్లికి 5 కిలోమీటర్లు దూరం వెళ్లాలి. వర్షంలోనే తన తమ్ముడు తరుణ్ నాయక్ సాయంతో ద్విచక్ర వాహనంలో బయలుదేరారు.

భారీ వర్షాల కారణంగా... మద్దిలేటయ్య వాగు ఉగ్రరూపం దాల్చింది. బ్రాహ్మణపల్లికి రావాలంటే కచ్చితంగా వాగు దాటాల్సిందే. వెళ్లటం ప్రమాదకరమని సోదరుడు వారించాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. సెక్రటరీ ప్రభాకర్ కు ఫోన్ చేశారు. వాగు దాటవద్దని... అవసరమైతే ఒకరోజు ఆలస్యంగా అయినా పింఛన్లు పంపిణీ చేయవచ్చని చెప్పారు. వాగు తగ్గుతుందేమోనని గంటసేపు ఎదురుచూశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. తన తోటి మరో వాలంటీర్ కరుణాకర్ కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది. వెంటనే వాలంటీర్ వెళ్లారు. తమ్ముడిని ఇంటికి పంపించి... వాలంటీర్ సాయంతో ఆమె వాగు దాటారు.

అనుకున్న సమయానికి....

తాను అనుకున్నట్లుగానే కాస్తంత ఆలస్యమైనా వాగుదాటి వచ్చి... అందరికీ ఉదయం 10.30 గంటలకు పింఛన్లు వందశాతం పంపిణీ చేశారు. పింఛన్ల పంపిణీ ఆలస్యం అయినందుకు ఎవరైనా ఏమైనా అంటారేమో అన్న ఉద్దేశ్యంతో... తన పరిస్థితిని వివరిస్తూ ఓ ఫొటోను సెక్రటరీకి పంపించారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది.

ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది... అభినందనలు తెలియజేశారు. ఇలాంటి సాహసం చేయటం వల్ల ప్రమాదం జరిగితే ఎలా అంటూ... సున్నితంగా హెచ్చరించారు. ఏది ఏమైనా తన కోసం ఎదురుచూస్తున్న 25 మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు ఒకటోతేదీ ఉదయాన్నే ఇవ్వాలన్న లక్ష్యాన్ని చేరుకున్నందుకు సంతోషంగా ఉందని చెబుతున్నారు సావిత్రిబాయి.

పింఛన్ల పంపిణీ పూర్తైంది. సాయంత్రం ఇంటికి వెళ్లాలని ప్రయత్నం చేశారు సావిత్రిబాయి. వాగు మరింత ఉద్ధృతమైంది. దీంతో రాత్రికి బ్రాహ్మణపల్లిలోనే బస చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి... సావిత్రిబాయిని ఘనంగా సన్మానించారు. తమ గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చిన సావిత్రిబాయిని స్థానికులు అభినందిస్తున్నారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం వల్లే తాను ఈ వృత్తిలోకి వచ్చానని చెబుతోంది సావిత్రీబాయి.

ఇదీ చదవండి:

కేంద్ర మంత్రి వర్గంలో పదవుల కోసమే దిల్లీకి జగన్: దేవినేని

Last Updated : Oct 5, 2020, 8:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.