వాలైంటైన్స్ డే రెండు హృదయాలను కలిపే సందర్భమని అందరికీ తెలుసు. తెలియని విషయం ఏంటంటే.. ఈవేడుకకు కాస్త ముందు, వెనుక రోజుల్లోనే ఎక్కువ జంటలు బ్రేకప్ చెప్పుకొని.. భగ్న ప్రేమికులుగా మారిపోతున్నారట. ఫిబ్రవరి 10 నుంచి 15 వరకు బ్రేకప్ సీజన్ అంటోంది ‘క్యుపిడ్ మంత్ర’ అనే సంస్థ అధ్యయనం. గిల్లికజ్జాలు, బహుమానాలు ఇచ్చిపుచ్చుకోవటంలో తేడాలు, ఆశించింది దక్కకపోవడం... ఇలా అనేక కారణాలతో బ్రేక్ప్ చెప్పుకుంటున్నారట. ఏడాది మెుత్తంలో విడిపోయిన జంటల్లో 43 శాతం మంది ఈ ఆరు రోజుల్లోనే బంధానికి బై బై చెప్పేసుకుంటునారని 'క్యుపిడ్ మంత్ర' అధ్యయనం చెబుతోంది.
ఇదీ చదవండీ... పోలింగ్ రోజే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సర్పంచ్ అభ్యర్థి