ETV Bharat / city

పగలు ఎండిన మోడు.. రాత్రి పచ్చని చెట్టు!!

అది ఓ పట్టణం... ఆ పట్టణంలో రోజు వాహనాల రద్దీ... ఆ వాహనాల శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి. పట్టణంలో పెద్ద పెద్ద భవనాలు.. ఆ భవనాల మధ్య ఓ ఎండిపోయిన చెట్టు. ఆ చెట్టు కొమ్మలు పగలంతా ఆకులు లేక ఎండిన దానిలా కనిపిస్తాయి. అదే సాయంత్రం 7 దాటితే ఆ చెట్టు కొమ్మలు పచ్చగా కనిపిస్తున్నాయి... అసలు దీని వెనుక కథేంటి..?

bhainsa peepal tree
భైంసాలో రావిచెట్టు
author img

By

Published : Mar 19, 2021, 9:26 AM IST

భైంసాలో రావిచెట్టు

తెలంగాణ నిర్మల్​ జిల్లా భైంసా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం పక్కన ఓ రాగి చెట్టు ఉంది. ఆ వృక్షం పగలంతా ఆకులు లేక ఎండిపోయిన దానిలా కనిపిస్తుంది. సాయంత్రం దాటితే పచ్చగా మారుతుంది. ఎందుకంటే... ఆ చెట్టు రామ చిలుకలకు ఆవాసం..

సూర్యాస్తమయం సమయంలో వేల సంఖ్యలో పక్షలు ఆ చెట్టుపైకి వచ్చేస్తాయి. రాత్రి ఆ చెట్టుపైనే ఉండి.. ఉదయాన్నే వెళ్లిపోతాయి. మళ్లీ ఆ సాయంత్రం వరకు కనబడవు. తిరిగి సాయంత్రం కాగానే వచ్చేస్తాయి. అక్కడ చుట్టు పక్కల ఉండే ప్రజలు సాయంత్రం వాటిని చూస్తూ... ఆస్వాదిస్తుంటారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.