ETV Bharat / city

Monsoon: రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు... వానలే వానలు - ఏపీ తాజా వార్తలు

Monsoon: నైరుతి రుతుపవనాల్లో జాప్యమేమీ లేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే కేరళలోకి ప్రవేశించాయని... రెండు రోజుల్లో రాష్ట్రంతో పాటు పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఆంధ్రలో ఒకట్రెండు చోట్ల వడగాడ్పులు వీయొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సూచించింది.

Monsoon
నైరుతి రుతుపవనాలు
author img

By

Published : Jun 10, 2022, 8:24 AM IST

Monsoon: నైరుతి రుతుపవనాలు శనివారం మధ్యాహ్నంలోగా దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ను పలకరించనున్నాయి. రెండు రోజుల్లో రాష్ట్రంతో పాటు పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. కేరళకు మూడు రోజులు ముందుగానే వచ్చిన రుతుపవనాలు జూన్‌ 7న రాష్ట్రానికి విస్తరించాల్సి ఉన్నా, వాతావరణం అనుకూలించక జాప్యమైంది.

వారం రోజులుగా దక్షిణ కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకే పరిమితమయ్యాయి. బుధవారం గోవా వరకు వ్యాపించాయి. ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ నుంచి కోస్తాంధ్ర వరకు ద్రోణి ఆవరించి ఉన్నందున శుక్ర, శని వారాల్లో కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశముంది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీయనున్నాయి. దక్షిణ ఆంధ్రలో ఒకట్రెండు చోట్ల వడగాడ్పులు వీయొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సూచించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.