కన్నకొడుకు ఇంటినుంచి గెంటేశాడయ్యా.. న్యాయం చేయాలని విలపిస్తోంది ఓ తల్లి. మచిలీపట్నానికి చెందిన కొట్టి నాగేశ్వరమ్మ భర్త మృతి చెంది ఎనిమిదేళ్లు అవుతోంది. అప్పటినుంచి కొడుకు వద్దే ఉంటున్నారు. వృద్ధాప్యంలో తనకు అండగా ఉంటాడని ఆమె తన వద్ద ఉన్న రూ.10లక్షల నగదు, 25 కాసుల ఆభరణాలు ఇలా ఉన్నవన్నీ కుమారుడికి ఇచ్చేశారు. అన్నీ చేతికివచ్చిన తరువాత..ఆమె ఊహించని విధంగా కొడుకు, కోడలు ఇంటినుంచి ఆమెను గెంటేశారు.
పెద్దకూతురు కూడా రావద్దని చెప్పడంతో విజయవాడలో ఉంటున్న చిన్నకూతురు వద్ద కొన్నినెలలుగా ఆశ్రయం పొందుతున్నారు. కూతురు వద్ద దీర్ఘకాలికంగా ఉండలేక, ఇంటికి వస్తానని అడిగితే కొడుకు, కోడలు ఒప్పుకోవడం లేదని కన్నీటిపర్యంతమవుతూ తన పరిస్థితిని జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో పోలీసులకు చెప్పి న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చూడండి:
STUDENTS PROTEST: అనంతలో విద్యార్థులపై విరిగిన లాఠీ.. విద్యాసంస్థల బంద్కు పిలుపు