రాష్ట్రంలో ఆహార సలహా సంఘం, అసైన్మెంట్ కమిటీ సభ్యుల సమావేశాలు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలంటూ.. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో జరిగే ఈ సమావేశాల ద్వారా పేద ప్రజలకు న్యాయం జరిగేదన్నారు. గ్రామీణులు భూమి సాగు చేసుకోడానికి... అర్హులను గుర్తించడానికి గతంలో అసైన్డ్ కమిటీలు ఉండేవని... అలాగే పేదల రేషన్ సమస్యలను పరిష్కరించడానికి ఆహార సలహా సంఘం కమిటీలు పనిచేసేవని తన లేఖలో పేర్కొన్నారు.
ఈ కమిటీల అధ్యక్షతన వివిధ రాజకీయ పార్టీల సభ్యులతో పేదల ఉపాధికి అసైన్డ్ భూముల కేటాయింపులు జరిగేవని వీర్రాజు వివరించారు. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో మండల తహసీల్దారు, జిల్లా కలెక్టరు, రాష్ట్ర స్థాయిలో కమిషనర్ నిర్వహణలో ఆహార సలహా సంఘాలుగా ఉండే ఈ కమిటీలు మూడేళ్లుగా లేకపోవడంవల్ల పేదలకు లబ్ధి చేకూరడంలో ఆటంకాలు ఎదురవుతున్నయని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ... విభజన తర్వాత ఏర్పడిన రాష్ట్రంలోనూ ఈ సంప్రదాయం అమలు కాకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. పేదలకు మేలు చేసే ఈ కమిటీలను తక్షణం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని తనలేఖలో సోము వీర్రాజు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: