రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా రమేశ్‌కుమార్ తొలగింపును.. ప్రభుత్వం కక్షపూరిత చర్యగా మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అడ్డు వచ్చిన రాజ్యాంగ సంస్థలను రద్దు చేసేస్తారా అంటూ సీఎం జగన్‌ను ప్రశ్నించారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ ఇలా చేయలేదన్నారు. రాజ్యాంగానికి లోబడి పాలన చేయాలనే ప్రజలు అధికారం ఇచ్చారని గుర్తు చేసుకోవాలని సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కోట్లమంది క్యూలో ఉండి ఓటు వేయాలని... అందుకే నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఎన్నికలు వాయిదా వేశారని సోమిరెడ్డి అన్నారు. నిమ్మగడ్డ రమేశ్ చేసింది సరైందని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. జస్టిస్ కనగరాజ్ క్వారంటైన్ పాటించకుండా బాధ్యత తీసుకోవచ్చా అని ప్రశ్నించారు. ఎస్‌ఈసీ వయసు 65 ఏళ్లు దాటకూడదనే నిబంధన ఉందని... 80 ఏళ్లు పైబడిన వ్యక్తిని ఎస్‌ఈసీగా ఎలా నియమించారని సోమిరెడ్డి ప్రశ్నించారు.
ఇదీ చదవండి: దిల్లీ వెళ్ల లేదు.. విదేశీ ప్రయాణం చేయలేదు