ETV Bharat / city

'రాజధాని ఒకటే ఉండాలి .. అదీ రాష్ట్రం మధ్యలోనే' - ramvela somaiyya on amaravathi

‘పరిపాలనా వికేంద్రీకరణ చేస్తున్నామని చెబుతున్నవారు.. అసలు వికేంద్రీకరణకు అర్థమేంటో తెలిసే మాట్లాడుతున్నారా అని సోషలిస్టు పార్టీ సీనియరు నాయకుడు రావెల సోమయ్య ప్రశ్నించారు. కేబినెట్‌లో ఒక్క మంత్రి కూడా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేరని అన్నారు. జిల్లా, మండల పరిషత్తులు, పంచాయతీలను బలోపేతం చేయడం, వాటికి మరిన్ని అధికారాలు ఇవ్వడమే నిజమైన వికేంద్రీకరణ అని పేర్కొన్నారు.

socialist party leader ravela somayya on amaravathi
రావెల సోమయ్య
author img

By

Published : Sep 3, 2020, 6:58 AM IST

‘పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామనే వారికి అసలు వికేంద్రీకరణకు అర్థమేంటో తెలుసా?’ అని సోషలిస్టు పార్టీ సీనియరు నాయకుడు రావెల సోమయ్య ప్రశ్నించారు. ఒకే రాజధాని.. అదీ రాష్ట్రం మధ్యలోనే ఉండాలని, సచివాలయం అక్కడే ఉండాలని స్పష్టం చేశారు. తుళ్లూరుకు చెందిన సోమయ్య డిగ్రీ చదివే రోజుల్లోనే సోషలిస్టు పార్టీవైపు ఆకర్షితులయ్యారు. 1967 ఎన్నికల్లో తాడికొండ నుంచి పోటీ చేశారు. ఇప్పుడు ఆయన వయసు 86 ఏళ్లు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై లోతైన అవగాహన ఉన్న ఆయన..రాజధాని తరలింపుపై తన అభిప్రాయాలను ‘ఈనాడు- ఈటీవీ భారత్’ ముఖాముఖిలో వెల్లడించారు.

  • 1953లోనే రాజధాని డిమాండ్‌

గుంటూరు- విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ఈనాటిది కాదు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు రాజధాని ఎక్కడ ఉండాలన్న అంశంపై విస్తృత చర్చ జరిగింది. విజయవాడ- గుంటూరు మధ్యే రాజధాని ఏర్పాటు చేయాలని కమ్యూనిస్టు పార్టీ గట్టిగా పట్టుబట్టింది. ఇక్కడైతే రాష్ట్రానికి మధ్యలో, అందరికీ సమాన దూరంలో ఉంటుందని భావించారు. పెద్ద రైల్వేజంక్షన్‌ ఉండటం అనుకూలమనీ వాదించారు. కానీ అప్పట్లో శ్రీబాగ్‌ ఒప్పందం నేపథ్యంలో.. కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు పెట్టడంవల్ల ఈ ప్రాంతానికి అవకాశం తప్పిపోయింది. ఇక్కడ రాజధాని ఏర్పాటు చేయాలని 2014లో నిర్ణయం తీసుకున్నాక... ఈ ప్రాంత ప్రజల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి కలిసి ఒక మహానగరం అవుతుందని అందరూ ఆశించారు.

  • కావాలంటే అసెంబ్లీనే విశాఖలో పెట్టుకోండి

విశాఖలో సచివాలయం, అమరావతిలో శాసనసభ, కర్నూలులో హైకోర్టు పెట్టడం పరిపాలనా వికేంద్రీకరణ ఎలా అవుతుంది? స్థానిక సంస్థల బలోపేతంతోనే అధికార వికేంద్రీకరణ సాధ్యమని చెప్పే లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ్‌ మూడు రాజధానుల ప్రతిపాదనను ఎందుకు వ్యతిరేకించడం లేదు? అసలు మూడు రాజధానులకు అర్థం లేదు. రాజధాని అంటే సచివాలయమే. ప్రజలకు ఎక్కువ అవసరం ఉండేది సచివాలయంతోనే. కాబట్టి అది రాష్ట్రానికి మధ్యలోనే ఉండాలి. కేంద్రం అంగీకరిస్తే హైకోర్టును కర్నూలులో పెట్టినా ఫర్వాలేదు. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలను విశాఖలో పెడితే, అనంతపురం జిల్లావారు అక్కడికి వెళ్లాలంటే ఎంత కష్టం. కావాలంటే అసెంబ్లీని విశాఖలో పెట్టుకోమనండి. సచివాలయం అమరావతిలోనే ఉండాలి.

  • చంద్రబాబు ప్రారంభించిన ప్రాజెక్టులను వైఎస్‌ కొనసాగించలేదా?

రాజధాని వస్తే తమ ప్రాంతంలో ఐటీ, ఇతర పరిశ్రమలు వస్తాయని, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆశపడి అక్కడి రైతులు భూములిచ్చారు. రాజధానిని తరలిస్తామనడం వారికి ద్రోహం చేయడమే. హైదరాబాద్‌లో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన అభివృద్ధిని, ఆయన తర్వాత అధికారంలోకి వచ్చిన రాజశేఖరరెడ్డి కొనసాగించారు కదా. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పాలకులు చేస్తున్నట్టుగా దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగలేదు.

  • అమరావతి అని పలకడమే సీఎంకు ఇష్టం లేదు

జగన్‌ అమరావతి అన్నమాట పలకడానికే ఇష్టపడటం లేదు. అమరావతి ఆంధ్రులకు చారిత్రక రాజధాని. ఇది గర్వంగా చెప్పాల్సిన పేరు. జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు గుంటూరు-విజయవాడ మధ్య రాజధానిని స్వాగతించారు. ఆయనే ఇప్పుడు మూడు రాజధానులంటున్నారు. రాజధానిని తరలించడం లేదని, శాసన రాజధాని ఇక్కడే ఉంటుందని చెబుతున్నారు. ప్రజలు అంత తెలివి తక్కువ వాళ్లనుకుంటున్నారా?

  • మొదటి నుంచీ అన్యాయమే

గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మొదటి నుంచీ పారిశ్రామిక అభివృద్ధి లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రుల్లో చాలామంది అభివృద్ధి మొత్తం హైదరాబాద్‌లో చేశారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న స్పృహే వారికి లేదు. కనీసం ఇక్కడ వ్యవసాయాధారిత పరిశ్రమలనూ అభివృద్ధి చేయలేదు. రాజధానిని తరలిస్తే ఈ ప్రాంతం మరింత వెనుకబాటుకు గురవుతుంది.

  • అమరావతిని ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పాలి కదా?

విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి నోట.. అమరావతి అభివృద్ధి అన్న మాటే రావడంలేదు. ఆ అభివృద్ధి ప్రణాళికలేంటో ప్రకటించాలి కదా? సీఎం ఎందుకు మాట్లాడరు?

  • రాజధాని 29 గ్రామాల వ్యవహారం కాదు

రాజధాని అంటే కేవలం 29 గ్రామాల వ్యవహారం కాదు. మొత్తం రాష్ట్రానికి సంబంధించింది. రాజధాని తరలిపోతే రాష్ట్రమంతా నష్టపోతుంది. రాజధానిని మారుస్తామని చెబుతుంటే ప్రజలు ఎందుకు మిన్నకుంటున్నారో అర్థం కాదు. గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలూ మాట్లాడకపోవడం ఆశ్చర్యంగా ఉంది.

ఇదీ చదవండి: సీఐడీ కేసుపై హైకోర్టును ఆశ్రయించిన ఎస్​ఈసీ నిమ్మగడ్డ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.