ETV Bharat / city

మనోబలం..సంకల్పం..నిరోధకశక్తి...కరోనాపోరులో ఆయుధాలివే..!

కొవిడ్ అని నిర్ధారణ కాగానే ఆందోళన, ఆవేదన ఎక్కువగా ఉంటాయి. గాబరా, భయం ఆవరిస్తాయి. కొత్త వ్యాధి కాబట్టి.. చావు బతుకుల మధ్య ఆశ మొదలవుతుంది. ఎంత ధైర్యం చెప్పుకున్నా ఏదో ఒక భయం ఆవహిస్తుంది. అయితే అవన్నీ అవసరం లేదు. దీనికి ఈ వ్యాధి ఒక్కో వ్యక్తిలో ఒక్కో రకంగా ప్రవర్తిస్తుండటం, సమాజంలో నెలకొన్న అపోహల కారణంగా నెలకొన్నవన్నీ అనవసర భయాలే. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత శారీరకంగా చేసే నష్టం కన్నా.. ఈ భయం, ఆందోళన చేసే నష్టమే ఎక్కువ. అందుకే మనకు మనమే ముందు ధైర్యం చెప్పుకోవాలి. ఈ మాటలంటోంది మరెవరో కాదు. కొవిడ్‌ బాధితులే.

మనోబలం..సంకల్పం..నిరోధకశక్తి...కరోనాపోరులో ఆయుధాలివే..!
మనోబలం..సంకల్పం..నిరోధకశక్తి...కరోనాపోరులో ఆయుధాలివే..!
author img

By

Published : Jul 14, 2020, 6:00 AM IST

ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. కరోనా విషయంలోనూ అంతే. ముఖ్యంగా ప్రస్తుతం నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల్లో ఆవేదన పెరిగిపోతుంది. ఇలాంటప్పుడే జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎక్కువగా ఆలోచించకూడదు. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సి-విటమిన్, ఆరోగ్యాన్నిచ్చే ఫలాలు, ముఖ్యంగా ఎండు ఫలాలు, కషాయాలు, వేడి నీళ్లు, ప్రాణాయామం, వైద్యులు సూచించిన మందులు రోజూ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవి వైద్యులు చెప్పే మాటలే కాదు. వైరస్‌ నుంచి కోలుకున్నవారు చెబుతున్న విజయసూత్రాలు.

అప్రమత్తతే ఆయుధం

అలాగే, రుచి, వాసన వంటి లక్షణాలను గమనిస్తూ.. అందుకు తగ్గ చికిత్స తీసుకోవాలి. జ్వరం సర్వసాధారణం. ఇందుకు ఆందోళన అనవసరం. అది పాజిటివ్‌ అని తేలిన 3, 4 రోజులు ఉండి తగ్గిపోతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విడవని దగ్గు, ఆయాసం, దమ్ము, దీర్ఘకాలిక వ్యాధులు, పెద్ద వయసు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల పర్యవేక్షణ అవసరం. ఇవేవీ లేని వారు ఇంట్లోనే ఉండి స్వస్థులవొచ్చు. పాజిటివ్ వచ్చిన చాలా మందిలో దగ్గు, జలుబు, తుమ్ములు అసలు ఉండవు. అలాంటప్పుడే మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటించిన చాలా మంది.. వైరస్‌తో పోరులో విజేతలుగా నిలిచారు.

వైరస్‌ ప్రభావం మొదలైన తర్వాత... పోరులో ముందున్న వైద్యసిబ్బంది, పోలీసులే వైరస్‌బారిని పడటం అందరినీ కలవరపెట్టింది. కానీ, సమాజంలోని సమస్యలపై పోరాడే వైద్యులు, పోలీసులు కరోనాతో పోరులో గెలిచి.. నిలిచిన తీరు అందరిలో స్ఫూర్తి నింపుతోంది.

ధైర్యమే రక్ష

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎంత అప్రమత్తంగా ఉన్నా.. చిన్న చిన్న పొరపాట్లు ఇబ్బందులు సృష్టిస్తాయనే నిజాన్ని చేదుగా తెలుసుకున్నారు మరో బాధితుడు. తన 73ఏళ్ల తల్లికీ వైరస్‌ సోకినా.. మనోనిబ్బరంతో ఇద్దరూ కరోనా నుంచి కోలుకుని సంతోషంగా ఇంటికి చేరుకున్నారు. ధైర్యంగా నిలబడితే కరోనాను ఓడించటం కష్టమేమం కాదని రుజువు చేశారు.

యువత అతీతులు కారు

యువతకు వైరస్‌ సోకే అవకాశాలు తక్కువ అనే... మాటలు మొదట్లో వినిపించినా ఆ తర్వాత వారు కూడా ఈ మహమ్మారి పంజాకు అతీతులు కాదని తేలింది. కానీ, చాలా మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ముఖ్యంగా యువకులు అజాగ్రత్తతో వైరస్‌ అంటించుకున్నా.. ఆ తర్వాత అనేక జాగ్రత్తలు తీసుకుని కరోనాను ఓంట్లోంచి తరిమేశారు. ఆ గాథలు మరెంతోమందిలో ధైర్యం నింపుతున్నాయి.

సంకల్పబలంతో కరోనాపై విజయం

శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువతి... హైదరాబాద్‌లో నివసిస్తోంది. గర్భంతో ఉన్న ఆమె.. కాన్పుకోసం పుట్టింటికి వెళ్తే కరోనా మహమ్మారి సోకిందని తేలింది. తీవ్ర ఆందోళన ఆమె కుటుంబం నిండు గర్భిణిగా ఉన్న కుమార్తెను ఐసోలేషన్‌లో ఉంచారు. సంకల్ప బలంతో ఆ యువతి కరోనాను జయించి.. మహాలక్ష్మిలాంటి చిన్నారిని తీసుకుని ఇంటికి చేరింది. ఆ కథ కరోనాతో పోరాడుతున్న ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోంది.

కరోనా విజేతలందరూ చెబుతున్న మాటొకటే. ఈ వ్యాధికి చికిత్స వ్యాధి నిరోధకశక్తి, మనోబలం, సంకల్పం. పోరాటంలో ఇవే ఆయుధాలు. లక్షణాలకు తగినట్లుగా చికిత్స తో ముందుకెళ్లాలి. శరీరంలో జరిగే ప్రతి మార్పును గమనిస్తూ.. వైద్యుల, అనుభవజ్ఞుల సలహాలతో ముందుకెళ్లాలి. మంచి ఆహారం, కంటి నిద్ర చాలా అవసరం. పండ్లు, మందులతో పాటు ధైర్యం చాలా అవసరం.

ఇదీ చదవండి : నాపై అనర్హత పిటిషన్ రాజ్యాంగ వ్యతిరేకం: రఘురామకృష్ణరాజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.