ETV Bharat / city

Guntupalli Srinivas: "ఇంటర్​లో మార్కుల కోసమే... సంస్కృతమా..?" - ఏపీ తాజా వార్తలు

Guntupalli Srinivas: ఇంటర్​లో మార్కుల కోసమే సంస్కృతం తీసుకుంటారా అని సామాజిక కార్యకర్త గుంటుపల్లి శ్రీనివాస్‌ ప్రశ్నించారు. ఇంటర్​లో ద్వితీయ భాషగా ఏ భాష ఉండాలనే దానిపై చర్చ జరగాలని ఆయన అన్నారు.

Guntupalli Srinivas
సామాజిక కార్యకర్త గుంటుపల్లి శ్రీనివాస్‌
author img

By

Published : Apr 13, 2022, 9:15 AM IST

Guntupalli Srinivas: ఇంటర్మీడియట్‌లో ద్వితీయ భాషగా తెలుగు ఉండాలా.. సంస్కృతం ఉండాలా అనేదానిపై విస్తృతంగా చర్చ జరగాలని పాఠశాల విద్యలో సంస్కరణలకు పాటుపడుతున్న సామాజిక కార్యకర్త గుంటుపల్లి శ్రీనివాస్‌ అన్నారు. 'గత కొన్నేళ్లుగా ఇంటర్‌లో 90శాతం మందికిపైగా విద్యార్థులు మార్కుల కోసం సంస్కృతాన్ని తీసుకుంటున్నారు. పరీక్షలకు రెండు రోజుల ముందు చదివితే సరిపోతుందని,.. 50పేజీల చిన్న పుస్తకం చదివితే వందకు 95 మార్కులు వస్తాయని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. సైన్సు సబ్జెక్టులు చదివేందుకు ఎక్కువ సమయం పడుతుందని,.. మార్కులు ఎక్కువ వస్తాయనే సంస్కృతాన్ని ఎంపిక చేసుకుంటున్నారన్నారు.

ఈ విషయం చర్చకు వచ్చినప్పుడల్లా కొద్దిమంది సంస్కృత, తెలుగు లెక్చరర్లు మాత్రమే స్పందిస్తున్నారు. ఒకటి నుంచి పదోతరగతి వరకు జరిగే బోధనలో చట్టబద్ధంగా తెలుగు ప్రథమ భాష. ప్రథమ భాష తెలుగును విధిగా బోధించాలనే చట్టం ఇంటర్మీడియట్‌కు వర్తించేలా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మాతృభాష నేర్చుకోవడం అనేది 15ఏళ్లకే నిలిపివేయడం చాలా తప్పుడు విధానం' అని సామాజిక కార్యకర్త గుంటుపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.

ఇదీ చదవండి: Two Degrees: ఏకకాలంలో రెండు డిగ్రీలు.. త్వరలో యూజీసీ సంస్కరణలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.