తెలంగాణ రాష్ట్ర సచివాలయ కార్యకలాపాలు కొనసాగుతున్న బీఆర్కే భవన్ ప్రాంగణంలో ఓ పాము కనిపించడం కలకలం రేపింది. భవన్ ప్రాంగణంలో చెత్త వేసే చోట పాము కనిపించింది. కాసేపటి తర్వాత ప్రవేశద్వార సమీపంలోని రంధ్రంలోకి వెళ్లిపోయింది.
ఆందోళనకు గురైన భద్రతా సిబ్బంది, ఉద్యోగులు... వెంటనే పాములు పట్టే వారిని రప్పించారు. అగ్నిమాపక యంత్రాన్ని పిలిపించి రంధ్రాల్లోకి నీటిని పంపించారు. అయినా పాము జాడ కనిపించలేదు. సోమవారం సైతం పాము కనిపించినట్లు కొందరు చెప్తున్నారు.
ఇదీ చూడండి: