రాఖీ పండుగ ఆ ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపింది. రాఖీ కట్టేందుకు ఐదుగురు అక్కాచెల్లెళ్లు వచ్చారు. కానీ ఆ సోదరుడు పుండగకు ముందు రోజు రాత్రే అనారోగ్యంతో కన్నుమూశారు. తెలంగాణలోని నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం చింతపల్లికి చెందిన లక్ష్మయ్యకు.. ఐదుగురు అక్కాచెల్లెళ్లు. ప్రతి ఏడు మాదిరిగానే అంతా కలిసి తమ ఒక్కగానొక్క సోదరుడి ఇంటికి వచ్చారు. తెల్లారితే రాఖీలు కట్టాలని ఆరాటపడ్డారు.
ఇంతలోనే లక్ష్మయ్య కన్నుమూత.. వారికి తీరని మనోవేదన మిగిల్చింది. అంత్యక్రియలు జరపడానికి ఏర్పాట్లు చేస్తుండగా సోదరుడికి చివరసారి రాఖీలు కట్టి తుది వీడ్కోలు పలికారు. ఈ ఘటన అందరినీ కంటతడి పెట్టించింది. తోబుట్టువుల పండుగ (Raksha Bandhan) నాడే ఇలా జరగడం.. ఆ గ్రామంలో విషాదఛాయలు నింపింది.
ఇదీ చదవండి:
అన్నకు రాఖీ కట్టి పంపింది.. కాసేపటికే అత్తింట్లో ప్రాణం పోయింది..!