ETV Bharat / city

తెలంగాణ :' అంజన్​ రావు ఇంట్లో రూ. 18.67 లక్షలు స్వాధీనం' - సిద్దిపేట సీపీ జోయల్​ డేవిస్​ వార్తలు

తెలంగాణ సిద్దిపేటలో ముగ్గురి ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించినట్లు సీపీ జోయల్​ డేవిస్​ తెలిపారు. ఈ క్రమంలోనే అంజన్​ రావు ఇంట్లో రూ. 18.67 లక్షలు దొరికినట్లు పేర్కొన్నారు. దుబ్బాకలో ఓటర్లకు పంపిణీ చేసేందుకే ఆ డబ్బు తెచ్చినట్లు చెప్పారు. నగదును సీజ్​ చేసినట్లు వెల్లడించారు. పోలీసుల నుంచి రూ. 5.07 లక్షలు భాజపా శ్రేణులు తీసుకెళ్లాయని జోయల్​ డేవిస్​ వెల్లడించారు

siddipeta
siddipeta
author img

By

Published : Oct 26, 2020, 11:43 PM IST

తెలంగాణ సిద్దిపేట పట్టణంలో మూడు చోట్ల తనిఖీలు నిర్వహించినట్లు సీపీ జోయల్​ డేవిస్​ తెలిపారు. సిద్దిపేట మున్సిపల్​ ఛైర్మన్​ రాజనర్సు, సురభి రాంగోపాల్​ రావు, అంజన్​ రావు ఇళ్లలో సోదాలు చేశామన్నారు. అంజన్‌రావు ఇంట్లో రూ.18.67 లక్షలు స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేశారు. దుబ్బాకలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు తెచ్చిన ఆ డబ్బును సీజ్​ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

అంజన్​ రావు ఇంట్లో రూ. 18.67 లక్షలు స్వాధీనం : సీపీ డేవిస్

అయితే ఈ క్రమంలో అంజన్​ రావు ఇంటివైపు రఘునందన్​ రావు, భాజపా శ్రేణులు ఒక్కసారిగా వచ్చాయని సీపీ తెలిపారు. పోలీసుల నుంచి రూ. 5.07 లక్షలు తీసుకెళ్లారని జోయల్​ డేవిస్​ వెల్లడించారు. డబ్బులు తీసుకెళ్లిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కేసుల మాఫీ కోసం పోలవరం తాకట్టు పెట్టారు: లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.