చర్లపల్లి జైలుకు శంషాబాద్ కిరాతకులు శంషాబాద్ ఘటనపై హైదరాబాద్‌లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. యువ పశువైద్యురాలి హత్యకేసులో నిందితులను ఉరితీయాలంటూ నిరసనకారులు చర్లపల్లి జైలు వద్ద నినాదాలతో హోరెత్తించారు. షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్ నుంచి ప్రత్యేక వాహనాల్లో నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు, ప్రజాసంఘాల కార్యకర్తలు కారాగారం వద్దకు భారీగా తరలివచ్చారు. నిందితులు ఉన్న వాహనాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఒక్కసారిగా జైలు వద్ద ఉద్రిక్త వాతవరణం ఏర్పడింది. అప్పటికే చర్లపల్లి జైలు వద్దకు చేరుకున్న పోలీసులు ఆందోళనకారులపై లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు. కొందరు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని వాహనాల్లో తరలించారు.
ఖైదీ నెంబర్లు కేటాయింపు
మరోవైపు శంషాబాద్ ఘటన నిందితులకు ఖైదీ నెంబర్లు ఇచ్చారు. చర్లపల్లి జైలులో హైసెక్యూరిటీ సింగిల్ బ్యారక్‌ను వీరికి కేటాయించారు. A-1 ఆరిఫ్‌కు 1979, A-2 జొల్లు శివకు 1980, A-3 చెన్నకేశవులుకు 1981, A-4 నవీన్‌కు 1982 నెంబర్లు జారీ చేశారు.
ఇదీ చదవండి
'శంషాబాద్' నిందితులకు 14 రోజుల రిమాండ్