ETV Bharat / city

తెరాస ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు...ఏమన్నారంటే..

author img

By

Published : Oct 24, 2021, 1:11 PM IST

తెరాస ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపఎన్నిక తర్వాత ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతారని జోస్యం చెప్పారు. సుమారు 15మంది తెరాస ఎమ్మెల్యే కాంగ్రెస్​లో చేరెందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

shabbir ali fires on trs leaders
shabbir ali fires on trs leaders

తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నిక అనంతరం తెరాస పని అయిపోయినట్లేనని తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్‌ షబ్బీర్‌ అలీ పేర్కొన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సుమారు 15 మంది తెరాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్​కు బుద్ధి చెప్పేందుకు హుజూరాబాద్​ ప్రజలు సిద్ధమయ్యారన్న షబ్బీర్​ అలీ.. ఈ ఉప ఎన్నిక ముగియగానే సీఎం కేసీఆర్‌కు గట్టి ఎదురుదెబ్బ తప్పదన్నారు. తెలంగాణలో తెరాస పని అయిపోయిందని జోస్యం చెప్పారు.

హుజూరాబాద్ ప్రజలు తెరాసను పట్టించుకోవడం లేదు. దాంతో ఆ పార్టీ నేతల్లో అసహనం పెరిగిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. తెరాస నేతలకు మతిభ్రమించిందని చెప్పడానికి వారు చేస్తున్న వ్యాఖ్యలే నిదర్శనం.-షబ్బీర్​ అలీ, తెలంగాణ కాంగ్రెస్​ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్​

ఇదీ చదవండి: TDP leaders: దాడిని పరిశీలించకుండా గోడకు నోటీసులు అంటించి వెళ్లడమేంటి..?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.