ETV Bharat / city

నాలుగోరోజూ తెదేపా సభ్యుల సస్పెన్షన్

author img

By

Published : Dec 3, 2020, 8:53 PM IST

అసెంబ్లీ సమావేశాల నాలుగో రోజు ఏడుగురు తెదేపా సభ్యులు సస్పెండ్ అయ్యారు. పీటీఐ కథనం ప్రకారం... ప్రత్యక్ష నగదు బదిలీ పథకంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలు తారాస్థాయికి చేరాయి. తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుపై ముఖ్యమంత్రి జగన్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రామానాయుడికి సభలో మాట్లాడే అర్హత లేదని, ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని సీఎం జగన్ డిమాండ్‌ చేశారు.

seven tdp members suspended form assembly on fourth day
నాలుగోరోజూ తెదేపా సభ్యుల సస్పెన్షన్

పీటీఐ కథనం ప్రకారం... అసెంబ్లీ సమావేశాల నాలుగో రోజు ఏడుగురు తెదేపా సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. వెలగపూడి రామకృష్ణబాబు, వీరాంజనేయులు, అచ్చెన్నాయుడు, మంతెన రామరాజు, జోగేశ్వరరావు, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్‌లను సభనుంచి ఒక రోజు పాటు సస్పెండ్‌ చేస్తున్నట్టు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు. దీనికి నిరసనగా సస్పెండ్ అయిన సభ్యులతో పాటు మిగతా తెదేపా ఎమ్మెల్యేలు, చంద్రబాబు సభనుంచి బయటకు వెళ్లిపోయారు.

ప్రత్యక్ష నగదు బదిలీ పథకంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలు తారాస్థాయికి చేరాయి. తమకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలని తెదేపా సభ్యులు డిమాండ్ చేశారు. తెదేపా సభ్యులు వెల్​లోకి ప్రవేశించి తమ నిరసన తెలిపారు. కొంత సమయం సభ గందరగోళంగా మారింది. శీతాకాల సమావేశాల్లో వరసగా నాలుగో రోజు తెదేపా సభ్యులను సస్పెండ్ చేశారు.

అంతకుముందు సభలో ఉద్రిక్తత నెలకొంది. సీఎం జగన్​, నిమ్మల రామానాయుడు మధ్య మాటల యుద్ధం జరిగింది. తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూరక్వంగా సభను తప్పుదారి పటిస్తున్నారని, పదేపదే అబద్దాలు చెప్పేవారికి మాట్లాడే అవకాశం​ ఇవ్వొద్దని సభాపతికి విజ్ఞప్తి. రామానాయుడికి సభలో మాట్లాడే అర్హత లేదని, ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వాస్తవాల ఆధారంగా రామానాయుడిపై చర్య తీసుకుంటామని స్పీకర్‌ సభలో ప్రకటించారు. సభలో వాస్తవాలు చెప్పాలని సభ్యులకు సూచించారు. రికార్డ్ నుంచి రామానాయుడు వాఖ్యలు తొలగించాలని స్పీకర్ ఆదేశించారు. తెదేపా సభ్యులు దీనిపై నిరసన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండీ... జగన్‌..అవగాహనలేని జీరో సీఎం: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.